Begin typing your search above and press return to search.
పవన్ సంగారెడ్డి టూర్ వెనుక మర్మమిదేనా?
By: Tupaki Desk | 15 March 2017 8:43 AM GMTజనసేన పార్టీ ఏర్పాటు చేసి మూడేళ్లు అవుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్. 2019లో జరిగే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయనున్నట్లు చెప్పిన ఆయన.. తాను అనంతపురం నుంచి పోటీ చేయనున్న విషయాన్ని చెప్పారు. మరికొద్ది నెల్లలో ప్రజల్లోకి వెళ్లేందుకు తాము సిద్ధమవుతున్నట్లు చెప్పిన పవన్ కల్యాణ్.. సంగారెడ్డికి తాను త్వరలో వెళ్లనున్నట్లు ప్రకటించారు. సంగారెడ్డి దగ్గర్లో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తనకు పలువురు ఫిర్యాదులు చేస్తున్నారని.. త్వరలో తాను అక్కడికి వెళ్లనున్నట్లు చెప్పారు.
పవన్ నోట సంగారెడ్డి రావటం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఎన్నో ప్రాంతాల్లో.. ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఆయన మాత్రం సంగారెడ్డిని ఎంచుకోవటం వెనుక అసలు ఉద్దేశం వేరన్న వాదన వినిపిస్తోంది. జనసేన పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసే మొదటిసభను సంగారెడ్డిని ఎంపిక చేసుకోవటం వెనుక అసలు లెక్క వేరన్నది పవన్ వర్గీయుల మాట.
సంగారెడ్డిలో సభను పెడితే.. భారీగా జనసమీకరణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని.. ఎందుకంటే.. తనకు సన్నిహితుడైన జగ్గారెడ్డి సపోర్ట్ పవన్ కు ఉంటుందని.. అందుకే ఆయన సభను అక్కడ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా బలమైన నేత కావటం.. పవన్ కు సన్నిహితుడు కావటంతో పాటు.. సభకు సంబంధించిన అన్ని వ్యవహారాలు తాను చూసుకుంటానని హామీ ఇచ్చారని అందుకే ఆ ప్రాంతాన్ని పవన్ ఎన్నుకున్నట్లుగా చెబుతున్నారు.
ఇటీవల సంగారెడ్డి శివారులో పవన్ తో జగ్గారెడ్డి భేటీ కావటాన్ని ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో బహిరంగంగా సమైక్య వాదాన్ని వినిపించిన ఏకైక తెలంగాణ నేతగా జగ్గారెడ్డి సుపరిచితులు. తనకు జగ్గారెడ్డి అంటే ఎంతో ఇష్టమని పవన్ చెబుతుంటారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం 2019ఎన్నికల్లో పవన్ పార్టీ తరఫున తెలంగాణలో పోటీ చేసే వారిలో జగ్గారెడ్డి ఒకరన్న మాట వినిపిస్తుంది. వీటన్నింటికి గ్రౌండ్ ప్రిపరేషన్లో భాగంగానే సంగారెడ్డి సభగా తెలుస్తోంది
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/