Begin typing your search above and press return to search.

పీకే.. ఈ పిల్లి మొగ్గ‌లేంటండీ!

By:  Tupaki Desk   |   20 March 2018 8:13 AM GMT
పీకే.. ఈ పిల్లి మొగ్గ‌లేంటండీ!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదాకు సంబంధించి ఇప్పుడు హాట్ హాట్‌ గా చ‌ర్చ న‌డుస్తోంది. ఈ వాడీవేడీ చ‌ర్చ‌కు తెర తీసింది జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణే. గ‌త‌వారం త‌న పార్టీ ఆవిర్భావ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించిన ప‌వ‌న్‌... అదే వేదిక‌పై పూర్తిగా యూట‌ర్న్ తీసుకున్నారు. అప్ప‌టిదాకా క‌లిసి సాగిన టీడీపీపై విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కుపెట్టారు. చంద్ర‌బాబు పాల‌న‌ను దునుమాడ‌టంతో పాటుగా చిన‌బాబుకు నీరాజ‌నాలు అందుకుంటున్న నారా లోకేశ్ అవినీతిపైనా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అంత‌టితో ఆగ‌ని ప‌వ‌న్‌... ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఎందుకు పోరాడ‌టం లేదంటూ ప్ర‌శ్నాస్త్రాలు సంధించారు. అస‌లు త‌న‌తో క‌లిసి పోరు సాగించి ఉంటే... ఈ పాటికి రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌చ్చేద‌న్న స్థాయిలో క‌ల‌రింగ్ ఇచ్చేశారు. ప్ర‌త్యేక ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూలంటూ గ‌తంలో తాను చేసిన పంచ్ డైలాగ్‌ ను మ‌రోమారు కూడా వినిపించారు. అంతే ఒక్క‌సారిగా ఏపీలో ప్ర‌త్యేక హోదా వేడి రాజుకుంది. అప్ప‌టికే పార్ల‌మెంటు వేదిక‌గా అటు విప‌క్ష వైసీపీతో పాటు ఇటు అధికార టీడీపీ కూడా పోరు సాగిస్తున్నా... ప‌వ‌న్ వ్యాఖ్య‌ల త‌ర్వాత టీడీపీ త‌న పోరు స్థాయిని అప్ప‌టిక‌ప్పుడు పెంచ‌క త‌ప్ప‌లేదు.

ఈ క్ర‌మంలోనే టీడీపీ నేత‌లు ప‌వ‌న్ ను బాగానే టార్గెట్ చేశారు. ఈ ఆరోప‌ణ‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోని ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఎప్ప‌టిలానే త‌న నిల‌క‌డ‌లేని త‌నాన్ని బ‌య‌ట‌పెట్టుకుంటూ... గ‌తంలో చంద్ర‌బాబు పాడిన పాత పాట‌నే వ‌ల్లె వేశారు. టీడీపీ ఆరోపిస్తున్న‌ట్లుగా బీజేపీకి మిత్ర‌ప‌క్షంగా మారిపోయిన మాదిరిగా... ప్ర‌త్యేక హోదా బ‌దులుగా రాష్ట్రానికి ఏ ర‌క‌మైన ఆర్థిక సాయం అందించినా ఫ‌ర‌వా లేద‌న్న వ్యాఖ్య ప‌వ‌న్ నోట నుంచి వెలువ‌డింది. అంతే ఒక్క‌సారిగా ప‌వ‌న్‌ ను టార్గెట్ చేస్తూ సోష‌ల్ మీడియా స‌హా... ఇత‌ర రాజ‌కీయ పార్టీలు కూడా ప‌వ‌న్ పైకి ఎదురు దాడి ప్రారంభించాయి. అప్ప‌టికి గానీ త‌న త‌ప్పు తెలుసుకోని ప‌వ‌న్‌... న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు ప్రారంభించారు. ఇందులో భాగంగా తాను ఇంట‌ర్వ్యూ ఇచ్చిన టీవీ ఛానెల్ ప్ర‌తినిధితో ఏపీకి ఏ ర‌కమైన ఆర్థిక సాయ‌మైనా ఫ‌ర‌వా లేద‌ని తాను వ్యాఖ్యానించ‌లేద‌ని ప‌వ‌న్ త‌ర‌ఫున జ‌న‌సేన ఓ పత్రికా ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. ప‌వ‌న్ ఇంట‌ర్వ్యూను ప్ర‌సారం చేసిన టీవీ ఛానెల్ ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుగా పేర్కొంద‌ని కూడా ఆ ప్ర‌కట‌న‌లో జ‌న‌సేన విచారం వెలిబుచ్చింది.

అయినా మాట మార్చ‌డం అంత ఈజీ కాద‌న్న విష‌యం ఇప్ప‌టికైనా ప‌వ‌న్‌కు అర్థ‌మైందో, లేదో తెలియ‌దు గానీ... చంద్ర‌బాబులా మాట మార్చ‌డం త‌న చేత కాద‌ని తేల్చేసుకున్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. ఏ విష‌యంలోనైనా మాట మార్చాల్సి వ‌స్తే... చంద్ర‌బాబు మంత్రాంగమే చాలా విభిన్నంగా ఉంటుంది. ప్ర‌స్తుతం చెప్పే మాట‌ను ప‌దే ప‌దే చెబుతూనే... గ‌తంలో తాను చేసిన వ్యాఖ్య‌ను మ‌రిపించేలా చంద్ర‌బాబు చాలా తెలివిగా మాట్లాడేస్తారు. ఇక టీడీపీ అనుకూల మీడియా కూడా బాబు డైరెక్ష‌న్‌ లోనే చాలా జాగ్ర‌త్త‌గా ప‌నిచేయ‌డంతో బాబు మాట మార్చుడు చాలా ఈజీగానే జ‌రిగిపోతుంది. మ‌రి అలాంటి నేర్పు ప‌వ‌న్‌ కు లేద‌నే చెప్పాలి. మొత్తంగా ఏది మాట్లాడినా చెల్లిపోతుందిలే అనుకున్న ప‌వ‌న్‌... తాను పిల్లిమొగ్గ‌లు వేసినా ఫ‌లితం ద‌క్క‌లేద‌ని ఇప్పుడు తెగ ఇదైపోతున్నార‌ట‌.