Begin typing your search above and press return to search.
హోదా మీద సముద్రంలోకి దిగిన పవన్ బ్యాచ్
By: Tupaki Desk | 15 May 2016 9:46 AM GMTఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చేసి చెబుతున్న బీజేపీ మీద ఏపీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఏపీ అధికారపక్షం బీజేపీ నేతల మీద ఫైర్ కావటం.. దీనికి కౌంటర్ అన్నట్లుగా ఏపీ అధికారపక్షంపై ఏపీ కమలనాథులు విరుచుకుపడటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై జరుగుతున్న అన్యాయానికి నిరసనగా పవన్ నేతృత్వంలోని జనసేన పార్టీకి చెందిన కొందరు వినూత్న నిరసనను తెలుపుతూ వాతావరణాన్ని మరింత హాట్ హాట్ గా మారుస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రత్యేక హోదా మీద జనసేన కార్యకర్తలు జలదీక్ష షురూ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్లకార్డులు పట్టుకొని సముద్రంలోకి దిగిన వారు.. నినాదాలు చేస్తూ మోడీ సర్కారు తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేస్తున్నారు.
విభజన సమయంలో బీజేపీ నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీని అన్నివిధాలుగా ఆదుకుంటామని ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు తగ్గట్లుగా వ్యవహరించాలని వారు కోరుతున్నారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్టీ జెండాలు పక్కన పెట్టి ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఒకటి కావాలంటూ వారు నినాదాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా మీద ప్రధాన పార్టీ నేతలు మాత్రమే రియాక్ట్ అవుతున్న వేళ.. అందుకు భిన్నంగా జనసేన కార్యకర్తలు నేరుగా కార్య రంగంలోకి దిగి నిరసనలు మొదలు పెట్టిన తీరు చూస్తే.. హోదా అంశంపై రానున్న రోజుల్లో ఏపీ మరింత రగిలిపోవటం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పవన్ బ్యాచ్ నిరసన బరిలోకి దిగిన వేళ.. మిగిలిన పార్టీ కార్యకర్తలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.