Begin typing your search above and press return to search.
బాబు కుట్రను పసిగట్టే పవన్ ఇలా చేశాడట
By: Tupaki Desk | 18 April 2018 6:14 AM GMTఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సినీ నటుడు - జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం కేటాయించిన సెక్యూరిటీని పవన్ వెనక్కి పంపారు. తనకు కేటాయించిన 2+2 గన్ మెన్ల భద్రతా సిబ్బందిని వెనక్కి పంపారు. నిన్న రాత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ ఏడాది మార్చి నెలలో గుంటూరులో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో తనపై దాడి జరిగే అవకాశముందని పవన్ పేర్కొనడంతో.. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం 2+2 గన్ మెన్ లను కేటాయించింది. ఈ గన్‌మెన్ లను ఏర్పాటు చేసిన నెల తర్వాత పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సెక్యూరిటీని పవన్ వెనక్కి పంపడంపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. టీడీపీ అధిష్టానం కుట్రలను పసిగట్టే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ గన్ మెన్లను వెనక్కి పంపించడంపై జనసేన వర్గాల నుంచి ఆసక్తికరమైన చర్చ వినిపిస్తోంది. భద్రత కోసం గన్ మెన్లను ఇచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈ సెక్యూరిటీని నిఘా కోసం వాడుకుంటోందనే అనుమానం పవన్ వ్యక్తం చేశారని పార్టీ వర్గాల సమాచారం. గన్ మెన్ల ద్వారా జనసేన పార్టీ అంతర్గత విషయాలు - సమావేశాల వివరాలు లీక్ అవుతున్నాయని పవన్ భావిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే గన్ మెన్లను వెనక్కి పంపే నిర్ణయం పవన్ తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని నలుగురు గన్ మెన్లకు పవన్ సిబ్బంది తెలిపారని సమాచారం. ప్రభుత్వానికి సరెండర్ కావాలని వారికి సూచించారు. ప్రభుత్వం కుట్రను ఆదిలోనే పవన్ కళ్యాణ్ పసిగట్టారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి.