Begin typing your search above and press return to search.
జనసేన రెండో దశ ఎంపిక హైదరాబాద్ లో
By: Tupaki Desk | 6 May 2017 6:42 AM GMTజనసేన పార్టీ అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మిగతా రాజకీయ పార్టీలకు భిన్నంగా...``ఎంపిక`` ప్రక్రియ ద్వారా తనతో కలిసి వచ్చే వారిని జనసేనలోకి తీసుకునేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో ప్రకటన విడుదల చేసిన జనసేన మొదటి దశలో అనంతపురంను ఎంచుకున్నట్లు తెలిపింది. అందులో భాగంగా ఏప్రిల్ 21 నుంచి నియామకం చేసింది. రెండో దశలో ఉత్తరాంధ్ర - హైదరాబాద్ లను ఎంచుకున్నట్లు జనసేన అధినత పవన్ కళ్యాణ్ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ - ఉత్తరాంధ్రలలో జనసేన ఎంపికల గురించిన జనసేన ప్రకటన ఇది. ``రాజకీయ ప్రక్రియలో నవతరం, మేధావులకు చోటు కల్పించాలన్న జనసేన సత్ సంకల్పంలో భాగంగా తలపెట్టిన ఎంపిక ప్రక్రియను ఈసారి గ్రేటర్ హైదరాబాద్ - ఉత్తరాంధ్రలోని విశాఖ- విజయనగరం- శ్రీకాకుళం జిల్లాల్లో చేపట్టాలని నిర్ణయించాము. అనంతపురం జిల్లాలో జరిగిన ఎంపికలను జయప్రదం చేసినందుకు ఆ జిల్లా వాసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జనసేన తరపున క్షేత్రస్థాయిలో చురుకుగా పాల్గొనేవారిని గుర్తించడానికి మాత్రమే ఈ ప్రక్రియను చేపట్టినట్లు గతంలోనే తెలియచేశాము. అందువల్ల ఈ ఎంపిక ప్రక్రియను పోటీ పరీక్షగా భావించరాదని, ఇది ప్రతిభను, వారి శక్తియుక్తులను గుర్తించడానికి మాత్రమేనని మీకు మరోసారి తెలియచేస్తున్నాను. స్పీకర్ (వక్త), అనలిస్ట్/కంటెంట్ రైటర్ విభాగాలకు ఔత్సాహికులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపవచ్చు. దరఖాస్తులు పంపే ఆన్ లైన్ చిరునామా (యుఆర్ఎల్) ను ఈ దిగువున పొందుపరుస్తున్నాము. దరఖాస్తులను 06:05, 17 నుంచి 13.05.17 రాత్రి 8 వరకు ఆన్ లైన్ లో పంపవచ్చు. ఈ రాజకీయ యజ్ఞంలో పాల్గొనదలచిన జన సైనికులకు,అభిమానులకు, యువతీయువకులకు, మేధావులకు ఈ సందర్భంగా నా శుభాభినందనలు. -జైహింద్`` అని పవన్ వివరించారు.
జనసేన పార్టీ ఎంపిక ప్రక్రియ కోసం ఆసక్తి చూపిస్తున్న వారు వెబ్‌సైట్లోని ఈ లింకుల ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్ జిల్లాః http://janasenaparty.org/greaterhyderabad/
విశాఖ జిల్లా : http://janasenaparty.org/visakhadistrict/
విజయనగరం జిల్లా : http://janasenaparty.org/vijayanagaramdistrict/
శ్రీకాకుళం జిల్లా : http://janasenaparty.org/srikakulamdistrict/