Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ టీంకు బాధితులు ఏం చెప్పారంటే

By:  Tupaki Desk   |   22 Nov 2016 1:30 PM GMT
ప‌వ‌న్ టీంకు బాధితులు ఏం చెప్పారంటే
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆదేశాల మేర‌కు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం స‌మీపంలో నిర్మిత‌మ‌వుతున్న గోదావ‌రి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో పార్టీ బృందం ప‌ర్య‌టించిది. జ‌న‌సేన కోశాధికారి రాఘ‌వ‌య్య‌ - మీడియా విభాగం అధిప‌తి హ‌రిప్ర‌సాద్‌ - పార్టీ ఉపాధ్య‌క్షులు మ‌హేంద‌ర్‌ రెడ్డి ఈ బృందంలో స‌భ్యులుగా ఉన్నారు. అక్వా ఫుడ్ పార్క్ ప‌ట్ల స‌మీప గ్రామాల ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర‌వుతున్న నేప‌ధ్యంలో ఇక్క‌డ వాస్త‌వ ప‌రిస్థితుల‌పై అధ్య‌య‌నం చేసేందుకు ఈ బృందం ఇక్క‌డ ప‌ర్య‌టించింద‌ని జ‌న‌సేన అధికారికంగా విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఆక్వా ఫుడ్ పార్క్‌ కి అతి స‌మీప గ్రామాలైన తుందుర్రు - కంసాలి బేత‌పూడి - జోన్న‌ల‌గ‌రువు గ్రామాల్లో ప్ర‌జ‌ల్ని ప‌లుక‌రించ‌గా., జ‌న‌సేన క‌మిటీ ముందు బాధితులు త‌మ స‌మ‌స్య‌ల్ని ఏక‌రువు పెట్టారు. ప్రాణాలైనా ఇస్తాం గాని అక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం మాత్రం జ‌ర‌గ‌నీయ‌మ‌ని చెబుతున్నారు. ప్రాజెక్టుని స‌ముద్ర తీరంలో యాజ‌మాన్యానికి ఉన్న 200 ఎక‌రాల స్థ‌లంలోకి త‌ర‌లించేందుకు అవ‌కాశం ఉన్నా మొండి వైఖ‌రితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. త‌మ ఇబ్బందులు జ‌న‌సేనాని ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాకే తాము కొంత ప్ర‌శాంతంగా ఉండ‌గ‌లుగుతున్నామని బాధితులు తెలిపారని జ‌న‌సేన ప్ర‌క‌ట‌న వివ‌రించింది. అంతకు ముందు త‌మ గ్రామాల్లో అప్ర‌క‌టిత క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణం నెల‌కొని ఉండేద‌ని - ఎవ‌రి గ్రామంలోకి వారు వెళ్లాల‌న్నా ఆధార్ కార్డులు చూపించాల్సి వ‌చ్చేద‌ని వాపోయారు. భ‌యంక‌ర‌మైన నిషేధాజ్ఞ‌లు ఉండేవ‌ని., ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ గారి జోక్యం త‌ర‌వాత‌. - పోలీస్ ఔట్ పోస్టులు అవి కాస్త తొల‌గించార‌ని చెప్పారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మాత్ర‌మే త‌మ‌కు పూర్తి స్థాయిలో న్యాయం చేయ‌గ‌ల‌ర‌ని భావిస్తున్న‌ట్టు బాధితులు తెలిపారని ఆ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. బాధితుల‌ అభిప్రాయాలు విన్న జ‌న‌సేన బృందం., ఆయా గ్రామాల్లో త‌మ ఆధ్య‌య‌నానికి సంబంధించిన‌ నివేదిక‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముందుంచుతామ‌ని హామీ ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/