Begin typing your search above and press return to search.

కేసీఆర్‌-కేటీఆర్‌కు ఓట్లేసే వాళ్ల‌కే..ద‌ళిత బంధు: ఎమ్మెల్యే కామెంట్స్‌

By:  Tupaki Desk   |   28 July 2022 11:30 AM GMT
కేసీఆర్‌-కేటీఆర్‌కు ఓట్లేసే వాళ్ల‌కే..ద‌ళిత బంధు:  ఎమ్మెల్యే కామెంట్స్‌
X
తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న ద‌ళిత బంధు ప‌థ‌కంపై అనేక వివాదాలు ముసురు కున్నాయి. ఇప్ప‌టికే దీనిని స‌రిగా అమ‌లు చేయ‌డం లేద‌ని.. ఎమ్మెల్యే అనుచ‌రుల‌కు.. ఎమ్మెల్యేలు.. మం త్రుల కుటుంబ స‌భ్యుల‌కు కూడా దీనిని ఇస్తున్నార‌నితీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

దీంతో కొంద‌రు దీనిని వ‌దులుకున్నారు కూడా. ఇక‌, ప్ర‌బుత్వం కూడా ఆచి తూచి ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. నిధుల‌ను ముందుగా క‌లెక్ట‌ర్ల‌కు ఇచ్చి.. త‌ర్వాత‌.. ద‌ళితుల ఖాతాల్లో విడ‌త‌ల వారీగా ఇచ్చే ఏర్పాట్లు కూడా చేశారు.

అయితే.. ఇది ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. జ‌నగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ద‌ళిత బంధు ప‌థ‌కంపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌ కు ఓటు వేసేవాళ్లకే దళిత బంధు ప‌థ‌కం కింద రూ.10 ల‌క్ష‌లు ఇస్తామని చెప్పారు. సిద్ధిపేట జిల్లా, కొమురవెల్లిలో అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. దళితబంధు ఎంపికపై అధికారులకు సూచనలు ఇచ్చారు. తెలంగాణ సోయ ఉన్నవాళ్లకే పథకాలు వర్తింపచేయాలన్నారు.

అక్క‌డి తో కూడా ఆగ‌కుండా.. సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్‌ల‌కు అదేవిధంగా టీఆర్ఎస్ త‌ర‌ఫున ఎవ‌రు పోటీ చేస్త‌రో.. వాళ్ల‌కు మాత్ర‌మే ఓట్లు వేసేవాళ్లకే దళితబంధు ఇవ్వాలని, వారినే అర్హులుగా తీసుకోవాల‌ని.. అధికారుల‌కు గ‌ట్టి సూచ‌న‌లే చేశారు.

తెలంగాణ తెచ్చింది.. కేసీఆర్ అని.. దానికోసం.. ఎన్నోఎళ్ల‌పాటు ఆయ‌న కోట్లాడిండ‌ని.. చెప్పారు. తెలంగాణ‌పై అవ‌గాహ‌న లేని వారికి ఎందుకు ఇవ్వాల‌ని..ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇలా ఎవ‌రైనా అధికారులు త‌ప్పు చేస్తే.. వారి జీతాల నుంచి కోత విధిస్తామ‌ని హెచ్చ‌రించారు.

అయితే, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వ్యాఖ్యలపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ పార్టీకి ఓట్లేసే వారి నుంచే ప‌న్నులు వ‌సూలు చేయండి.. వారితోనే ప‌న్నులు క‌ట్టించుకోండి? అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. టీఆర్ ఎస్ కాని వారి నుంచి ఎందుకు.. ప‌న్నులుక‌ట్టించుకుంటున్నార‌ని.. ఇదే మ‌న్నా.. కేసీఆర్ సంపాయించిన సొమ్ము నుంచి ఇస్తున్నారా? అంటూ.. నిప్పులు చెరిగారు. దీంతో ఇది.. వివాదంగా మారుతోంది.