Begin typing your search above and press return to search.
బాహుబలిపై మాట మార్చేసిన జానారెడ్డి
By: Tupaki Desk | 4 Jun 2017 8:02 AM GMTకాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - సీఎల్పీ నాయకుడు జానారెడ్డి ముక్కుసూటితనానికి మారుపేరు, మాట మార్చే రాజకీయాలకు చాలా దూరం అనే భావన చాలా మందిలో ఉండేది. అయితే ఆయనపై సదరు అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వస్తుందేమో అన్నట్లుగా తాజాగా జానా తీరు ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి బాహుబలి వస్తాడంటూ గతంలో ప్రకటించి రాజకీయంగా భారీ చర్చను లేవనెత్తిన జానారెడ్డి ఎట్టకేలకు ఆ సినిమా చూశారు. రామానాయుడు స్టూడియో ప్రివ్యూ థియేటర్ లో ప్రత్యేక షో వేయించుకున్న జానారెడ్డి బాహుబలి కామెంట్స్ చేసిన సమయంలోనే సినిమా చూడాలన్న కోరికను నెరవేర్చుకున్నారు.
పార్టీ ముఖ్యనేతలు షబ్బీర్ అలీ - వి.హనుమంతరావుతో కలసి బాహుబలిని చూసిన జానారెడ్డి థియేటర్ నుంచి వెలుపలికి వచ్చాక మీడియాతో మాట్లాడుతూ ఆశ్చర్యకర కామెంట్లు చేశారు. సినిమాలు వేరు - నిజ జీవితం వేరంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. నిజ జీవితంలో బాహుబలులు - కట్టప్పలు ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. బాహుబలిని రాజకీయాలకు అన్వయించే విషయంలో సినిమాల్లో మంచి చెడులను విశ్లేషించుకున్నాక మాట్లాడతానంటూ జానారెడ్డి జవాబు దాటవేసే ప్రయత్నం చేశారు. ఇంతకీ తమకు ఎందుకు బాహుబలి సినిమా చూపించారు...ఆ తర్వాత నిజ జీవితంలో బాహుబలి ఎవరూ ఉండరటూ ఎందుకు వ్యాఖ్యానించారు అని చర్చించుకోవడం జానారెడ్డితో కలిసి సినిమా చూసిన విలేకరుల వంతు అయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/