Begin typing your search above and press return to search.
హోదా పోతుందనే జానా ఆరాటం!
By: Tupaki Desk | 16 April 2016 5:12 AM GMTతెలంగాణ కాంగ్రెస్ పార్టీనుంచి గతంలో చాలా వికెట్లు రాలిపోయాయి. ఆయన ఎన్నడూ ఇంత తీవ్రంగా స్పందించింది లేదు. పైపెచ్చు, మధ్య మధ్యలోల అవకాశం వచ్చినప్పుడు అధికార తెరాస పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా? అని అనుమానాలు కలిగేలాగా కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు క్రమంగా తన హోదా కిందికే నీళ్లు వస్తుండే సరికి ఆయన కంగారు పడుతున్నారు. విపరీతంగా స్పందిచేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, శాసనసభలో ఆ పార్టీకి ఫ్లోర్ లీడర్ అయిన జానారెడ్డి ప్రస్తుత ఫిరాయింపుల మీద మాత్రం మరీ ఎక్కువగా స్పందిస్తున్న తీరు గురించి సంగతి ఏమిటా అని ఆరా తీస్తే.. ఆయనకున్న కేబినెట్ హోదా గల్లంతవుతుందేమోనని భయం అంటూ పార్టీ వర్గాలు మర్మం విప్పి చెప్పడం విశేషం.
జానారెడ్డి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. నిజానికి ఈ పదవికి చాలా పోటీ ఏర్పడింది. మహిళల కోటాలో డీకే అరుణ - మహిళ మరియు దళిత కోటాలో గీతారెడ్డి, పార్టీకోసం కష్టపడుతున్న కోటాలో కోమటిరెడ్డి ఇలా పలువురు దీన్ని దక్కించుకోవాలని చూశారు. అయితే సీనియర్ అయిన జానారెడ్డిని పదవి వరించింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కేబినెట్ హోదా ఉంటుంది. జానారెడ్డి ప్రస్తుతం ఎంచక్కా ఆ హోదాను అనుభవిస్తున్నారు.
మధ్యలో నీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ వంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆయన కేసీఆర్ సర్కారు నిర్ణయాలు భేష్ అన్నట్లుగా మాట్లాడిన వైనం కూడా అందరికీ గుర్తుండవచ్చు. గతంలో పలుమార్లు.. ప్రభుత్వం పట్ల మెతగ్గా ఉన్నందుకు రాహుల్ - జానాను మందలించినట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఇన్ని జరిగినా ఆయనలో చలనం రాలేదు గానీ.. ఇప్పుడు ఫిరాయింపులపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. చిట్టెం వెళ్లిపోయాక.. సుప్రీంలో కేసు వేస్తాం అని, ప్రధానికే ఫిర్యాదు చేస్తాం అని రెచ్చిపోతున్నారు. విషయం ఏంటంటే.. చిట్టెం తర్వాత మరికొంతమంది కూడా పార్టీ మారవచ్చునని క్యూలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ బలం 12 కంటె తగ్గితే వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా పోతుంది. అంటే జానారెడ్డి కి కేబినెట్ ర్యాంకు హోదా పోతుందన్నమాట. అందుకే కొత్తగా ఫిరాయింపులు అనే పదం వినిపిస్తే జానారెడ్డి అసహనానికి గురవుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.