Begin typing your search above and press return to search.

మాజీ సీఎం కుమారుడికి సీన్ ఉందా? జ‌న‌సేన‌లో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

By:  Tupaki Desk   |   25 July 2022 6:20 AM GMT
మాజీ సీఎం కుమారుడికి సీన్ ఉందా?  జ‌న‌సేన‌లో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌
X
ఆయ‌న ముఖ్య‌మంత్రి కుమారుడు. ఉమ్మ‌డి రాష్ట్ర అసెంబ్లీలో స్పీక‌ర్‌గా కూడా ప‌నిచేశారు. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కుతారా? ఆయ‌నకు ప్ర‌జ‌లు జై కొడ‌తారా? ఇదీ.. ఇప్పుడు జ‌న‌సేన నేత‌ల్లోనే సాగుతున్న చ‌ర్చ‌. ఆయ‌నే మాజీ సీఎం నాదెండ్ల భాస్క‌ర‌రావు కుమారుడు నాదెండ్ల మ‌నోహ‌ర్‌. 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున గుంటూరు జిల్లా తెనాలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన ఆయ‌న కేవ‌లం 2 వేల ఓట్ల మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కారు. ఆ స‌మ‌యంలోనే ఆయ‌న స్పీక‌ర్‌గా ప‌నిచేశారు.

త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో ఆయ‌న పోటీకి దూరంగా ఉన్నారు. త‌ర్వాత జ‌న‌సేన‌లో చేరారు. పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌గా కొన‌సాగుతున్నారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన టికెట్‌పై తెనాలి నుంచి పోటీ చేశారు. అయితే.. ఇక్క‌డ ఆయ‌నకు కేవ‌లం 21 వేల ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. దీంతో డిపాజిట్ కూడా కోల్పోయిన ప‌రిస్థితి ఎదురైంది. అయితే.. ఇప్పుడు మ‌రో సారి ఆయ‌న తెనాలి నుంచి పోటీకి రెడీ అవుతున్నారు.కానీ, ఆయ‌న గెలుపు సాధ్య‌మేనా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల నుంచి కూడా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న‌ది లేదు.

పైగా.. ఇక్క‌డ వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ రాజ‌కీయాలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబ‌త్తుని శివ‌కుమార్ దూకుడుగా ఉన్నారు. ఈయ‌న‌కు పోటీగా.. టీడీపీ మాజీ మంత్రి ఆల‌పాటి రాజా కూడా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. పార్టీ ని ముందుకు తీసుకువెళ్తున్నారు. వీరితో పోల్చుకుంటే.. జ‌నసేన ఊపు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పైగా నాదెండ్ల సాఫ్ట్ కార్న‌ర్‌. కానీ.. ఇక్క‌డ మాస్ ఫాలోయింగ్ ఎక్కువ‌. గ‌తంలో వైఎస్ ప్ర‌చారం చేయ‌డం.. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కారు. కానీ, ఇప్పుడు జ‌న‌సేన త‌ర‌ఫున ఆయ‌న‌కు ప‌వ‌న్ ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

ఇది జ‌రిగినా.. ప్ర‌జ‌ల్లో నాయ‌కుడిగా ఆయ‌న గుర్తింపు పొందాలి. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న మాస్‌ను క‌లిసింది లేదు. జ‌నంలో తిరిగింది కూడా లేదు. దీంతో నాదెండ్ల గెలుపు అంత ఈజీకాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం గ‌ట్టి పోటీ ఉన్న నేప‌థ్యంలో నాదెండ్ల‌కు ఏమేర‌కు జోష్ పెరుగుతుంద‌నేది చెప్ప‌డం క‌ష్ట‌మేన‌ని జ‌న‌సేన‌లోనూ గుసుగుస వినిపి స్తోంది.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికైనా నాదెండ్ల జాగ్ర‌త్త ప‌డాల‌ని.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని.. ఆయ‌న లాంటి ఓ ప‌ది మంది అయినా.. గెలిస్తే.. ఖ‌చ్చితంగా జ‌న‌సేన వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని అసెంబ్లీలో అడుగు పెట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి