Begin typing your search above and press return to search.
పవన్ కల్యాణ్ కు అస్వస్థత.. జనవాణి వాయిదా!
By: Tupaki Desk | 20 July 2022 12:30 PM GMTజనసేనాని పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కోనసీమ జిల్లాలోని మండపేటలో కౌలురైతు భరోసా యాత్రను ఆయన నిర్వహించారు.
ఇందులో భాగంగా ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు. మొత్తం 33 కౌలు రైతు కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం పవన్ కల్యాణ్ అందించారు.
అలాగే భీమవరంలో జనవాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్న పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ కు గురయ్యారు. అలాగే పవన్ తోపాటు ముఖ్యమైన నేతలు, ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా జ్వరాలతో అనారోగ్యానికి గురయ్యారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఆదివారం (జూలై 24) నిర్వహించే జనవాణి కార్యక్రమాన్ని జూలై 31కి వాయిదా వేశారు. స్థలం, వేదిక వివరాలను త్వరలోనే తెలియజేస్తామని జనసేన పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇప్పటికే విజయవాడ, భీమవరంల్లో మూడు విడతల జనవాణి కార్యక్రమాలు పూర్తయిన విషయం తెలిసిందే. రాయలసీమ, ఉత్తరాంధ్రలో మిగిలిన రెండు కార్యక్రమాలు జరుగుతాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్, వినోదయ సీతం తమిళ రీమేక్ మూవీలో తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలసి నటిస్తున్నారు. అలాగే తన అభిమాని, పారిశ్రామికవేత్త రామ్ తాళ్లూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ ఓ చిత్రం తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి.