Begin typing your search above and press return to search.
వైసీపీ ఎమ్మెల్యేను నిలదీసిన జనసేన కార్యకర్త ఆత్మహత్య !
By: Tupaki Desk | 18 Jan 2021 12:45 PM GMTఏపీలోని ప్రకాశం జిల్లాలో సోమవారం ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు సమస్యల పై వైసీపీ ఎమ్మెల్యే 'అన్నారాంబాబు' ను ప్రశ్నించిన జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకొని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ , బాగోద్వేగానికి గురైయ్యారు. సమస్యలపై ప్రశ్నిస్తే ప్రాణాలు పోగొట్టుకోవలసిందేనా అని ప్రశ్నించారు. జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్య నాయుడు ఆత్మహత్య బాధాకరమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంగయ్య ఆత్మహత్యకు అధికార పక్షం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
వైసీపీ నిరంకుశ పాలనకు నిదర్శనమిది. గ్రామంలో పారశుద్ధ్య సమస్యపై ఎమ్మెల్యేను ప్రశ్నించడం తప్పా. కనీసం సమాధానం ఇవ్వలేని స్థితిలో ఎమ్మెల్యే రాంబాబు ఉన్నారా - నీ మెడలో పార్టీ కండువా తీయ్ - అని మొదలుపెట్టి సభ్యసమాజం పలకలేని భాషలో మాట్లాడతారా, ప్రశ్నించిన ఆ యువకుణ్ని ప్రజల మధ్యనే ఎమ్మెల్యే బెదిరించారు. వివిధ రూపాల్లో ఒత్తిళ్లకు గురి చేసినట్లు మాకు సమాచారం అందింది అని పవన్ కళ్యాణ్ అన్నారు. అతను తన ఒక్కడి సౌకర్యం కోసం ప్రశ్నించలేదని.. ఊళ్లో ప్రజలందరి కోసం మాట్లాడరని పేర్కొన్నారు. ఆ గొంతు అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఎందుకు భయం పుట్టించిందని పవన్ ప్రశ్నించారు. ఆ భయంతోనే వెంగయ్య నాయుడు గొంతు నొక్కే పని ఆ క్షణం నుంచే అధికార పక్షం మొదలుపెట్టిందని ఆరోపించారు. వెంగయ్య నాయుడు మరణంపై సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
అసలు ఆ జనసేన కార్యకర్త , ఎమ్మెల్యే మధ్య ఏం జరిగింది అంటే .. గ్రామంలోని రోడ్డు సమస్యపై నడిరోడ్డుపై కారు ఆపి నిలదీయడంపై ఎమ్మెల్యే రాంబాబు.. జనసేన కార్యకర్తను చెడమడా తిట్టేశారు. ‘‘నువ్వెవుడి రా నాకు చెప్పడానికి.. తమాషా పడుతున్నావా? ఒళ్లు దగ్గర పెట్టుకో.. నన్నే ప్రశ్నిస్తావా! నా వద్దకు వస్తూ మెడలో ఆ కండువా ఏంటి? కండువా తీసెయ్ ముందు. ఆ తర్వాత మాట్లాడు’’ అంటూ ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ఫైరయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.