Begin typing your search above and press return to search.
జనసేన కార్యకర్తలకు విశాఖ జైల్లో అలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చారట
By: Tupaki Desk | 31 Oct 2022 4:16 AM GMTవిశాఖపట్నంలో జనసేనాని పవన్ కల్యాణ్ నిర్వహించిన తలపెట్టిన జనవాణి కార్యక్రమం అనూహ్యంగా ఆగిపోవటం.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు యావత్తు సినిమాటిక్ గా జరగటం తెలిసిందే. అయితే.. దీనికి సంబంధించిన పలు సంచలన నిజాల్ని బయటపెట్టారు పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్. తాజాగా విలేకరుల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మరింత రక్షణతో పాటు.. ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టిందని.. ఆయనపై దాడి చేసేందుకు భారీ ప్లాన్ జరిగిన వైనాన్ని వెల్లడించారు.
ఇందులో భాగంగా విశాఖలో ఆయన పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పలు పరిణామాల్ని వివరించిన ఆయన.. దాడికి జరిగిన ప్లానింగ్ ను వీడియో రూపంలో తెలియజేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఏపీ మంత్రుల కాన్వాయ్ పై దాడి జరగటం.. వాహనాలు ధ్వంసం కావటం తెలిసిందే. ఈ ఉదంతంపై ఎయిర్ పోర్టు అథారిటీ ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వనప్పటికి.. తమ పార్టీకి చెందిన పలువురిని పెద్ద ఎత్తున అరెస్టు చేశారని నాదెండ్ల వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. జైల్లో పెట్టిన తమ పార్టీ నేతల్ని.. కార్యకర్తల్ని ఎంతలా హింసించారో కళ్లకు కట్టినట్లుగా ఆరోపించారు. జైల్లో ఉన్న తమ పార్టీ నేతలపై దాడి చేశారని సంచలన ఆరోపణలు చేశారు. తమ నేతలపై థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగిందని చెప్పారు.
"జైల్లో ఉన్న మా పార్టీ నేతల్ని పేరు పేరునా పిలిచారు. వారిని పక్కనున్న గదిలోకి తీసుకెళ్లి బట్టలు ఊడదీసి బెల్టుతో కొట్టారు" అంటూ నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి.. నాదెండ్ల వ్యాఖ్యలపై ఏపీ జైళ్ల శాఖ అధికారి ఏమైనా రియాక్టు అవుతారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.