Begin typing your search above and press return to search.

పవన్ అసెంబ్లీ సీట్ల నోటిఫికేషన్

By:  Tupaki Desk   |   3 Feb 2019 5:23 AM GMT
పవన్ అసెంబ్లీ సీట్ల నోటిఫికేషన్
X
పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీలో కొత్త ఒరవడికి నాంది పలికారు. జనసేన టికెట్లను ప్రజారాజ్యంలా కాకుండా ఓ పద్ధతి ప్రకారం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.. జనసేన టికెట్లు కావాలంటే ఇప్పుడు పెద్ద ప్రాసెస్ అభ్యర్థులకు ఎదురుకానుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్టు జనసేన టికెట్ల కోసం అధిష్టానానికి దరఖాస్తు చేసుకోవాలి. వారు వడపోసి అభ్యర్థికి టికెట్లు కేటాయిస్తారు.

తాజాగా జనసేనాని పవన్ అసెంబ్లీ టికెట్ కోసం సరికొత్త పంథాను ఎంచుకున్నారు. ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దీనికోసం ఓ స్క్రీనింగ్ కమిటీని కూడా పవన్ ఏర్పాటు చేశారు. అందులో శివశంకర్, గంగాధరం, అరహం ఖాన్, హరిప్రసాద్, మహేందర్ రెడ్డిలు సభ్యులుగా ఉన్నారు. ఈ ఐదుగురు టికెట్లు ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి అభ్యర్థి వ్యక్తిగత బలం, పోరాట పఠిమ, గెలిచే సామర్థ్యత, సామాజిక అంశాలు, స్పందన, నిబద్ధత ఇలా చాలా కొలమానాలు అంచనావేసి నివేదిక రూపొందించి పవన్ కళ్యాణ్ కు అందజేస్తారు. ఇలా ప్రతీ నియోజకవర్గం నుంచి ఆశావహులను వడపోసి.. స్క్రీనింగ్ కమిటీ రిపోర్ట్ తయారు చేస్తుంది. ఈ నియమాలన్నింటిని జనసేనాని పవన్ స్వయంగా రూపొందించినట్టు సమాచారం.

ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహిస్తారట.. ఆ సర్వేల్లో నిలబడిన వారికి లిస్ట్ పార్టీ జనరల్ బాడీకి చేరుతుంది. జనరల్ బాడీ ఖారారు చేసిన తర్వాత జనసేన టికెట్ దక్కుతుంది. రిజెక్ట్ చేసిన వారు నొచ్చుకోకుండా వారికి పార్టీ పదవులు ఇస్తారట..

ఇలా జనసేన టికెట్ల కోసం పవన్ ఉద్యోగాలకు తరహా చాలా నియమాలు, నిబంధనలు పెట్టారు. అంతిమంగా ధనబలం ఉన్న వాళ్లకే జనసేన టికెట్లు దక్కుతాయనే ప్రచారం బహిరంగంగానే సాగుతోంది. ప్రజారాజ్యంలా దెబ్బైపోకూడదన్న పవన్ ఆలోచనమేరకే ఈ తతంగమంతా సాగుతోందట.. ఇక 80శాతం కొత్త వారికే జనసేన టికెట్లు అన్న పవన్ హామీ కూడా నిలబడడం కష్టమననే ప్రచారం సాగుతోంది. డబ్బుమయంగా మారిన రాజకీయాల్లో పవన్ కొత్త ఒరవడి ఎంత మేరకు ఫలిస్తుందో.. టికెట్లు ఎంత మేరకు పారదర్శకంగా ఇస్తాడో వచ్చే ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే.