Begin typing your search above and press return to search.
ఎవరూ ఊహించని ఎత్తుగడలో పవన్... ?
By: Tupaki Desk | 25 Oct 2021 8:49 AM GMTపవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఏడేళ్ళు అయింది. ఆయన ఇంతకాలం పార్టీ పట్ల కానీ రాజకీయాల పట్ల కానీ పెద్ద సీరియస్ గా ఉన్నారని ఎవరూ అనుకోవడంలేదు. ఆయన తనదైన రాజకీయం చేసుకుంటూ పోయారు. పవన్ కనుక కరెక్ట్ గా పాలిటిక్స్ చేస్తే ఆయనకంటూ ఒక స్పేస్ ఏపీలో ఎపుడూ ఉంటుంది అన్న వారూ ఉన్నారు. మరి ఇన్నాళ్ళకు పవన్ కూడా ఇదే విషయం తెలుసుకున్నారా అన్న చర్చ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవడంలేదు. చాలా సీరియస్ గానే ఈసారి ఆయన బరిలోకి దిగబోతున్నారు. ఆయన వ్యూహాలు కూడా బాగా పదును తేరుతున్నాయి. రాజకీయాల్లో శత్రువులు మిత్రులు ఎవరూ ఉండరు అంటారు. పవన్ కూడా ఇపుడు ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు అని చెప్పాలేమో. మొత్తానికి పవన్ ఇకపైన వేసే అడుగులు అన్నీ కూడా అనూహ్యంగా ఉంటాయని, ప్రత్యర్ధులకు ఎప్పటికపుడు షాక్ ఇస్తాయని అంటున్నారు.
ఇంతకీ పవన్ ఏం చేస్తారు అంటే ఒక ప్రచారం అయితే గట్టిగానే వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో దూరం అవుతారని, అదే టైమ్ లో ఆయన మరో బలమైన జాతీయ పార్టీ కాంగ్రెస్ తో చేతులు కలుపుతారు అని. నిజానికి వినడానికి ఇది వింతగా ఉన్నా కూడా రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు కాబట్టి ఎవరూ నో అని కూడా చెప్పలేరేమో. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని మొదలెట్టింది కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా. ఆనాడు ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ నాయకత్వాన కాంగ్రెస్ పాలన సాగుతోంది. పంచెలూడగొడతాను అంటూ పవన్ మార్క్ పంచ్ లతో ఆయన ప్రజారాజ్యం పార్టీలో యువ రాజ్యం అధినేతగా చెలరేగిపోయారు. ఆ తరువాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలసినపుడు పవన్ దూరంగా ఉండిపోయారు.
ఇక విభజన తరువాత ఆయన కాంగ్రెస్ ని తీవ్రంగా వ్యతిరేకించారు, విమర్శించారు. ఇపుడు చాలా కాలం జరిగింది. కేంద్రంలో మోడీ సర్కార్ కి ఒకనాడు మద్దతు ఇచ్చిన పవన్ ఇపుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అంటున్నారు. ఏపీలో చూస్తే రెండు ఎన్నికలలో ఒక్క సీటు కూడా దక్కించుకోకుండా చతికిలపడిన కాంగ్రెస్ తో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారని టాక్ అయితే బలంగా ఉంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ జనసేనను కాంగ్రెస్ లో విలీనం చేస్తారు అన్న టాక్ కూడా నడుస్తోంది. కాంగ్రెస్ కి ఏపీలో సరైన లీడర్ షిప్ లేదు. దాంతో వారు జనసేనను విలీనం చేసుకుని పవన్ని భావి సీఎం గా ప్రకటిస్తారని, అలాగే పీసీసీ చీఫ్ గా కూడా నియమించి జనంలోకి పంపుతారు అంటున్నారు.
పవన్ కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేస్తారా అంటే చేసేందుకు అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఎపుడూ గొప్పవే. నాయకులు సరైన వారు ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీ కూడా గొప్పగానే పాలిస్తుంది. తప్పు నాయకులదే తప్ప పార్టీది కాదు, ఇక కాంగ్రెస్ అంటే అన్ని వర్గాల పార్టీ అన్న పేరుంది. కులమతాలకు అతీతమైన పార్టీగా కూడా కాంగ్రెస్ ని ఈ రోజుకూ చెప్పుకుంటారు. అన్నింటికీ మించి ప్రతీ పల్లెల్లో కాంగ్రెస్ ఓట్లు ఎన్నో కొన్ని ఉన్నాయి. కాంగ్రెస్ అంటే తెలియని వారు ఎవరూ లేరు. ఏపీలో నిజానికి కాంగ్రెస్ ఎపుడూ బలంగానే ఉంది. కానీ పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్లనే దిగనారింది. ఇపుడు పవన్ లాంటి చరిష్మాటిక్ లీడర్ కనుక ఉంటే కచ్చితంగా కాంగ్రెస్ ఎత్తిగిల్లుతుంది అన్న ఆశ అందరిలోనూ ఉంది.
మరి ఈ రకంగా తెర వెనక ఎంతో కొంత కసరత్తు జరుగుతోందన్న సంకేతాలు అయితే ఉన్నాయి. మరి వాటిని దృష్టిలో ఉంచుకునే కాబోలు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఏపీలో అధికారంలోకి వస్తుంది, కాపు సామాజిక వర్గం నేత సీఎం అవుతారు అని ఈ మధ్యన ప్రకటిస్తున్నారు. మొత్తానికి పవన్ చాలా తెలివిగానే వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ మాజీ సీఎం దామోదరం సంజీవయ్య వంటి వారిని కీర్తించడం వెనక కూడా పవన్ మార్క్ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. కాంగ్రెస్ లాంటి పార్టీలో పవన్ చేరుతారా. తన జనసేనను విలీనం చేస్తారా. లేక పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతారా అన్నవి వేచి చూడాల్సిన విషయాలు. మొత్తానికి పవన్ కేవలం టీడీపీతో జట్టు కట్టి తోక పార్టీగానే ఉంటారు అని వైసీపీ చేస్తున్న ఆరోపణలు తప్పు అనిపించేలా చాలా లోతుగానే పవన్ ఆలోచనలు ఉన్నాయన్నది తెలుస్తున్న విషయం.