Begin typing your search above and press return to search.
అప్పట్లో ఫైర్ బ్రాండ్.. ఇప్పుడు `లో- బ్రాండ్`.. పవన్ మౌనం వెనక ?
By: Tupaki Desk | 20 Jun 2021 11:30 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. దాదాపు రెండేళ్లుగా ఆయన ఆశించిన విధంగా దూకుడు చూపించడం లేదు. గతంలో వైసీపీపైనా.. పార్టీ అధినేత జగన్‌పైనా తీవ్రస్థాయిలో రెచ్చిపోయి.. ఫైర్ బ్రాండ్ మాదిరిగా పొలిటికల్ పంచ్‌లు విసిరిన పవన్.. రాజకీయాలను వేడెక్కించారు. ముఖ్యమంత్రి కొడుకైతే.. మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఇచ్చేయాలా? ఒక కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి కాకూడదా? అంటూ.. ఎన్నికల ప్రచారంలో రెచ్చిపోయారు. నిజానికి ఎన్నికల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు.. అప్పటి ముఖ్యమంత్రిపై విమర్శలు చేసే ప్రతిపక్షాల మాదిరిగా కాకుండా.. ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకున్నారు.
ప్రధానంగా.. జగన్ సీఎం కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదన పవన్ విషయంలో జోరుగా వినిపించింది. అయితే.. ఆయన ఎవరి విమర్శలను పట్టించుకోకుండానే ముందుకు సాగారు. ఇక, ఎన్నికల అనంతరం.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నపవన్.. ఆ పార్టీ నేతలతో కలిసి.. జగన్‌పై విరుచుకు పడ్డారు. రాజధాని అమరావతి విషయంలోనూ.. మూడు రాజధానుల విషయంలోనూ.. పవన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదేవిధంగా మంత్రి కొడాలి నాని పైనా కొన్నాళ్ల కిందట ఫైరయ్యారు తప్ప.. నేరుగా సీఎం జగన్‌పై మాత్రం కామెంట్లు తగ్గించారు.
ఎన్నికలకు ముందు జగన్‌ను తీవ్రస్థాయిలో విమర్శించిన పవన్.. తర్వాత.. ఆయనపై విమర్శలు తగ్గిస్తూ.. వచ్చారు. మరి ఒక్కసారిగా ఈ మార్పు ఎందుకు వచ్చింది ? పవన్ ఎందుకు విమర్శలు తగ్గించారు ? అంటే.. దీనికి రెండు రీజన్లు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఒకటి.. కేంద్రంలోని బీజేపీ నేతలు.. పవన్‌ను కంట్రోల్ చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తుండగా.. మరో రీజన్‌కూడా ఉందని అంటున్నారు.
పవన్‌పై వైసీపీ నేతలు.. పెయిడ్ ఆర్టిస్ట్.. అంటూ.. విమర్శలు చేసేవారు. పవన్ - బాబుకు రీ సౌండ్ అన్న విమర్శలు ఎక్కువుగా చేసేవారు. అయితే.. ఇటీవల వారు కూడా ఈ విమర్శలు తగ్గించారు. అంటే.. తనపై ఉన్న పెయిడ్ అనే ముద్రను, మరకలను చెరిపేసుకునేందుకే.. పవన్ మౌనం పాటిస్తున్నారని.. విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా.. రాజకీయాల్లో దూకుడుగా ఉన్నా.. మౌనంగా ఉన్నా..పవన్ కళ్యాణ్ విషయంలో చర్చనీయాంశం కావడం గమనార్హం.