Begin typing your search above and press return to search.
సాగర పవనాలు : తీరంలో సరదా సరదాగా
By: Tupaki Desk | 12 Nov 2022 3:33 PM GMTఆయన పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్. ఆయనలో ఎన్నో కోణాలు. ఒకసారి అవేశంగా విరుచుకు పడుతూ ప్రత్యర్ధులకు దడ పుట్టిస్తారు. మరోసారి వెన్నల కంటే చల్లగా నవ్వుతూ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తారు. నిజానికి పవన్ లో హీరో మాత్రమే ఉన్నాడనుకుంటారు కానీ సామాన్యుడు ఉన్నారు. అన్నింటికీ మించి ఒక తాత్వికుడు ఉన్నారు. ఆయన ప్రకృతి ప్రేమికుడు. అందుకే గత నెల విశాఖ బీచ్ రోడ్డు వద్ద ఉన్న నోవెటల్ హొటల్ గదిలో ఉన్నపుడు ట్విట్టర్ లో రాసుకున్నారు.
విశాఖ బీచ్ లో అలా సరదాగా హాయిగా నడవాలని. ఆ కోరిక ఆయనకు నెల రోజులు తిరగకుండానే తీరిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు విశాఖకు వచ్చిన పవన్ కళ్యాణ్ డైరీలో ఒక రోజు ఖాళీగా ఉంది. అదే నవంబర్ 12. ఆ రోజున ఆయన షెడ్యూల్ లో ఏ కార్యక్రమం లేదు. అందుకే ఆయన తన రాజకీయ సహచరుడు నాదెండ్ల మనోహర్ తో కలసి విశాఖ బీచ్ లో సరదాగా విహరించారు.
తీరానికి దూసుకుని వచ్చిన కడలి కెరటాలతో ఆటలాడారు. ఆహ్లాదకరమైన చల్లని గాలిని పీల్చుతూ కొత్త అనుభూతులను పొందారు. విశాఖ బీచ్ అందాలను కళ్ళారా చూసి పులకించిపోయారు. ఆ సమీపంలో వెళ్తున్న ఒక మత్య్సకారుడిని పిలిచి మరీ ఆయనతో ముచ్చటించారు.
ఇలా కెరటాలతో ఆడుకుంటూ పవన్ చిన్న పిల్లాడైపోతుంటే ఆయనను కెమెరాలో బంధించిన జనసేన నేతలు సోషల్ మీడియాలో వదిలారు. అంతే తెగ వైరల్ అయి బీభత్సమైన క్రేజ్ ని పుట్టించాయి. పవన్ లోని ఈ లవ్ లీ యాంగిల్ చూసి అంతా ఫిదా అవుతున్నారు. వారెవ్వా పవన్ సార్. విశాఖ బీచ్ లవర్ గా మీరు మారిపోయిన తీరు చూస్తే సూపర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక రుషికొండ వద్ద బీచ్ తీరంలో కాసేపు విహరించిన పవన్ అక్కడే ఏపీలో హాట్ పొలిటికల్ టాపిక్ గా ఉన్న రుషికొండను చూశారు. అక్కడ ఎత్తుగా ఉన్న మన్ను దిబ్బలెక్కి మరీ కొండమీద సాగుతున్న విద్వంశాన్ని చూసి ఔరా ఇదేమి మింగుడు కార్యక్రమం రా బాబూ అనుకున్నారు.
దానికి జనసైనికులు కాప్షన్ పెడుతూ విశాఖలో రుషికొండను మింగుతున్న వైసీపీ నేతల తీరుని కళ్ళారా చూస్తున్న పవన్ అంటూ ఫోటోలు సోషల్ మీడియాకు వదిలారు. అవి కూడా సంచలనం అయ్యాయి. మొత్తానికి గత నెలలో విశాఖ వచ్చిన పవన్ అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు.
ఈసారి మాత్రం దేశాన్ని ఏలే బలమైన ప్రధాని మోడీతో అపాయింట్మెంట్ దొరికింది. ఆ మీదట పవన్ పొలిటికల్ ఇమేజ్ రెట్టింపు అయింది. ఇపుడు విశాఖ బీచ్ లో సరదా సరదగా పవన్ గడుపుతూ మంచి రోజులు మనవే సైనిక్స్ అంటూ వారికి గట్టి భరోసా ఇస్తున్నట్లుగా అంతా ఉంది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.