Begin typing your search above and press return to search.
ఇన్ని మైనస్‌లు పెట్టుకుని అధికారంలోకి ఎలా వస్తావ్ పవనూ...!
By: Tupaki Desk | 18 July 2022 2:30 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ఆ పార్టీకి బలాన్ని ఇస్తాయా? ఆయన ఊహిం చినట్టు.. పార్టీని బలోపేతం చేస్తుందా? అనేది ప్రశ్నగా మారింది. తాజాగా ఆయన గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి.. ఆర్థిక సాయం కూడా అందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. పార్టీకి మేలుచేస్తాయా? కీడుచేస్తాయా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఇంతకీ.. పవన్ ఏమన్నారంటే..వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని.. తాను అధికారంలోకి వస్తే.. ప్రజల కు, రాష్ట్రానికి కూడా మేలు చేస్తానని చెప్పారు. అదేసమయంలో వైసీపీ లేని ఏపీని తీసుకురావాలని పవన్ పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు.
ఇక, మరోవైపు.. తన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు.. విషయాలు పరిశీలించ కండని.. తనను చూసి ఓటేయాలని.. పవన్ పిలుపునిచ్చారు. తన పార్టీ తరఫున గెలిచే వారికి తానే బాధ్యత వహిస్తానని కూడా చెప్పారు.
ఇక, శ్రీలంకలో ఎలా అయితే.. తిరుగుబాటు వచ్చిందో అలా ప్రజలు వైసీపీ సర్కారుపై కూడా ప్రజలు తిర గబడాలని సూచించారు. ఇలా.. పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేశారో.. లేక వ్యూహం లేకుం డానే చేశారో.. తెలియాల్సి ఉంది. అయితే.. ప్రజల్లో మాత్రం కొన్నిధర్మ సందేహాలు అలానే మిగిలిపోయ యి. పవన్‌ను ఎలా నమ్మాలనేది కీలక ప్రశ్న. ఎందుకంటే.. కేంద్రంతో చేతులు కలిపిన.. పవన్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. సో.. ఆయన కేంద్రంతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ.. ఏపీకిఏమీచేయలేక పోయారు.
పెట్రోల్ ధరలు పెరిగినా.. గ్యాస్ ధరలు పెంచేసినా.. విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేసేందుకు రెడీ అయినా.. ఎక్కడా కేంద్రాన్ని పవన్ ప్రశ్నించలేదు. అదే సమయంలో ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టేశారు. ఇవన్నీ కూడా ఏపీ ప్రజలు కోరుతున్న కీలక అంశాలు. వీటిపై పవన్ ముందుగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ నాయకుడిపై అయినా.. నమ్మకం ఏర్పడాలంటే.. ముందుగా.. ఆయన ఏం చేసినా.. చేయకున్నా.. ప్రజల మధ్య ఉండాలి.
కానీ, పవన్ పున్నమికో.. అమావాస్యకో ఒకసారి వచ్చిపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే పవన్ అంటే పెద్దగా ఆసక్తి లేదని అంటున్నారు. మరి ఇన్ని మైనస్‌లు పెట్టుకుని పవన్ ఎలా అధికారంలోకి రావాలని అనుకుంటున్నారనేది ప్రధాన కీలక ప్రశ్నగా మారింది. చూడాలి మరి.. పవన్ వ్యూహంఏంటో!!