Begin typing your search above and press return to search.
పవన్ పాలిటిక్స్ : వంగవీటికి వందనం
By: Tupaki Desk | 30 Jun 2022 1:46 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో పెద్ద ఎత్తున మార్పు కనిపిస్తోంది. ఆయన మునుపటిలా లేరు. రాజకీయంగా దూకుడు పెంచుతున్నారు. అంతే కాదు. దేన్ని లైట్ తీసుకోవడం లేదు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన ఆయనలో కనిపిస్తోంది. నిజంగా ఇదే కావాల్సింది. పవన్ ఇపుడు వేస్తున్న ఒక్కో అడుగూ కరెక్ట్ రూట్ లోనే వెళ్తోంది.
ఇన్నాళ్ళూ ఆయన ఎక్కువగా ఇంటెలెక్చువల్ స్పీచ్ ఇస్తూ ఉండేవారు. తనకు కులం మతం వర్గం వర్ణం లేదు అని చెప్పేవారు. 2019 ఎన్నికల్లో ఆయన చేసిన తప్పులలో ఇది ఒకటి. అయితే ఇపుడు మాత్రం పవన్ మారిపోయారు. ఆ మధ్య రాజమండ్రీ సభలో పవన్ కొంతవరకూ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఇపుడు చూస్తే మరింతగా దాన్ని విస్తరిస్తున్నారు.
కాపులకు ఆరాధ్యదేవుడు అయిన వంగవీటి మోహన రంగాను తన వాడుగా మరింతగా దగ్గ్గరకు తీసుకోబోతున్నారు. కాపులకు రంగా ఐకాన్ లాంటి వారు. ఆయన పేరు ఒక వైబ్రేషన్ గా ఆ జాతికి ఉంటుంది. అలాంటి రంగా కోరిక కాపుల జెండాని అధికార స్థానాన గట్టిగా పాతడం. ఆయన ఆశయం సాధించడం కోసం గత ముప్పయ్యేళ్ళుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ సరైన రాజకీయ రహదారిని చేరుకోలేకపోతున్నాయి.
ఇపుడు చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన వంగవీటికి వందనం చెబుతూ ఆయన స్పూర్తితో ముందుకు సాగాలనుకుంటున్నారు. దానికి నాందిగా జనసేన జూలై 4న వంగవీటి రంగా 75వ జయంతి ఉత్సవాలను ఉపయోగించుకుంటోంది. ఆ రోజున వంగవీటి రంగా ఇంటికి స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. అక్కడ రంగా విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటిస్తారు.
ఈ సందర్భంగా రంగా వారసుడు రాధాక్రిష్ణను జనసేనలోకి పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తారు అని తెలుస్తోంది. రాధాక్రిష్ణ కాంగ్రెస్ తరఫున 2004లో ఎమ్మెల్యే అయ్యారు. 2009లో ఆయన ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014 నాటికి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడారు. 2019లో టీడీపీలో చేరారు. ఇలా రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో అనేక పార్టీలను చూసిన రాధా మళ్ళీ వైసీపీ వైపు చూస్తున్నారు అన్న టాక్ నడుస్తోంది.
దాంతో ఆయన చేజారిపోకుండా తమ వైపునకు తిప్పుకునేందుకు పవన్ స్వయంగా వంగవీటి ఇంటికి వెళ్తారని, రాధాను జనసేనలోకి తీసుకుని వస్తారని అంటున్నారు. రాధా కనుక జనసేనలో చేరితే ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో జనసేనకు కొండంత అండగా ఉంటుంది. అదే టైమ్ లో వంగవీటి రంగా బలం బలగం కూడా మొత్తం జనసేన వైపు టర్న్ అవుతాయి. మొత్తానికి పవన్ మంచి ఆలోచన చేస్తున్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ రాజకీయాలను కొత్త మలుపు తిప్పుతుందని చెప్పవచ్చు.