Begin typing your search above and press return to search.
పవన్లో ఏమిటీ గందరగోళం ?
By: Tupaki Desk | 13 Dec 2021 6:41 AM GMTజనసేన అధినేత ఎంత ఎక్కువసేపు మాట్లాడితే అంత గందగోళంగా ఉంటుంది. కానీ మైక్ దొరికితే ఆగలేడు. పూనకం వచ్చినట్లు నోటికొచ్చినట్లు మాట్లాడేస్తుంటాడు. తాజాగా పవన్ స్పీచ్ విన్న వారంతా అయోమయంలో పడిపోయారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు నిరసనగా దీక్ష చేశారు. దీక్ష సందర్భంగా పవన్ మాట్లాడిన మాటలు ఆయనలోని గందరగోలనికి నిదర్శనంగా నిలిచాయి. ఎప్పుడు చూసినా అవే మాటలు.
తనను జనాలు ఓడగొట్టారని, ఒక్క ఎంఎల్ఏని కానీ ఒక్క ఎంపీని కానీ గెలిపించలేదని, ఓడిపోయిన ఎంఎల్ఏ అభ్యర్ధిని వైసీపీ ప్రభుత్వాన్ని ఎలా శాసించగలను ? అంటు ఏదేదో మాట్లాడారు.
ఒకవైపేమో వైసీపీ ప్రభుత్వం మెడలొంచి పనిచేయిస్తానంటు బెదిరిస్తారు. ఇదే సమయంలో జనాలు తనకు మద్దతుగా నిలవకపోతే ప్రభుత్వంతో తాను ఏ విధంగా పనిచేయించగలను ? అంటు నిలదీస్తారు. ప్రజలు, పార్టీలు తనవెనుక నిలబడకపోతే తాను ఎలా పోరాడగలను ? అని అడుగుతారు. వెంటనే తనవెనుక ఎవరు లేకపోయినా పోరాటాలు ఆపేది లేదంటారు.
తనకు పదవులు, అధికారం ముఖ్యం కాదంటునే అధికారం లేకపోయినా, చట్టసభలో బలం లేకపోయినా ఏమి చేయగలమని జనాలనే ప్రశ్నించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను అమిత్ షా తో ఎప్పుడో మాట్లాడేశాను, ప్రైవేటీకరణ జరగదని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో పార్టీలన్నీ ఏకతాటిపైన నిలిస్తే కానీ ప్రైవేటీకరణ ఆగదంటారు.
అన్నీ పార్టీలు తనకు మద్దతుగా నిలబడితే పోరాటాలు ఎలా చేయాలో చేసి చూపిస్తానని చెప్పారు. వెంటనే మోడీ దగ్గర తనకు మంచిపేరుంది కాబట్టి గొడవలు పెట్టుకోవటం ఇష్టం లేదంటారు.
వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయం కేంద్రప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయంలో భాగమే అని గతంలో అన్నారు. ఇపుడేమో వైసీపీ ప్రభుత్వం చేతకానితనం వల్లే ప్రైవేటీకరణ జరిగిపోతోందంటు జగన్మోహన్ రెడ్డిని నిందిస్తున్నారు.
రెండింటిలో ఏది కరెక్టో పవన్ కే తెలిసినట్లు లేదు. లేస్తే మనిషిని కాదని సామెత చెప్పినట్లు 22 మంది ఎంపీలు జనసేనకు ఉండుంటే ప్రైవేటీకరణ జరగనిచ్చే వాడిని కాదంటారు. లేని ఎంపీలను ఇచ్చుంటే, ఉండుంటే అనే చర్చే అవసరం లేదుకదా.
ప్రభుత్వం మెడలు ఎలా వంచాలో తనకు తెలుసంటునే ఆ బాధ్యత జనసైనికులు తీసుకోవాలని చెప్పటం పవన్ కే చెల్లింది. మళ్ళీ తాను చెబితే వైసీపీ ప్రభుత్వం వినేరకం కాదని పవనే అన్నారు.
అసలు పవన్ మాటల్లో ఇంత గందరగోళం ఎందుకుంటోందో అర్ధం కావటంలేదు. పవన్ ఎక్కడ మాట్లాడినా ఇలాగే గందరగోళంగా మాట్లాడుతారు. అందుకనే పవన్ ఏమి మాట్లాడినా చివరకు అభిమానులు కూడా విని చప్పట్లు కొట్టి వెంటనే వదిలేస్తున్నారు.