Begin typing your search above and press return to search.
మాటకు మాట.. తిట్టుకు తిట్టు..: జనసేన కొత్త స్ట్రాటజీ..
By: Tupaki Desk | 30 April 2022 8:30 AM GMTఏపీలో వైసీపీ, జనసేనల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల కొత్త కేబినేట్ ఏర్పడిన తరువాత కొందరు మంత్రులు జనసేనను టార్గెట్ చేశారు. ఇప్పటి వరకు తమకెదురులేదని అనుకున్న వైసీపీ నాయకులు ఇప్పుడు జనసైనికులపై విరుచుకుపడుతున్నారు.
ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసుకొని కామెంట్స్ చేస్తున్నారు. అయితే వైసీపీ నాయకులకు ధీటుగా జనసైనికులు కౌంటర్ ఇస్తున్నారు. గతంలో జనసేన పేరెత్తగానే వైసీపీ నాయకులు భగ్గుమనేవారు. కానీ ఇప్పుడు జనసైనికులు సైతం అదేస్థాయిలో కౌంటర్లు ఇవ్వడంతో ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీ నాయకులు ఒకప్పుడు టీడీపీ నాయకులను టార్గెట్ చేయగా ఇప్పుడు జనసేనను లక్ష్యంగా పెట్టుకోవడంపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
మరోసారి మంత్రి పదవి చేపట్టి జలవనరుల శాఖ బాధ్యతలు స్వీకరించిన తరువాత అంబటి రాంబాబు జనసేనపై విరుచుకుపడ్డారు. పవన్ రెండు చోట్ల ఓడిపోయాడని ఎద్దేవా చేశారు. దీంతో జనసైనికులు భగ్గుమన్నారు. మంత్రి పదవి చేపట్టిన తరువాత శాఖ పనిపై దృష్టిపెట్టకుండా తమ నాయకుడిని ఎందుకు ఆడిపోసుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు. అసలు పవన్ అంటే ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. అటు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సైతం పవన్ ను విమర్శించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పవన్ పార్టీ నాయకులు గుడివాడ అమర్ నాథ్ చెత్త పుత్రుడు అంటూ కౌంటర్ ఇచ్చారు.
ఇన్నాళ్లు రాజకీయంగా సాగిన విమర్శలు ఇప్పుడు పర్సనల్ విషయాలను టచ్ చేస్తున్నారు. అనంతరపురం జిల్లాలో పవన్ పర్యటించిన సందర్భంగా మంత్రులు ఆయనపై విమర్శలు చేశారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర సందర్భంగా కూడా వ్యక్తి గత విషయాలను టచ్ చేస్తున్నారు.
పవన్ సీబీఎన్ దత్తపుత్రుడు అని వైసీపీ నాయకులు విమర్శలు చేయగా.. జగన్ సీబీఐ దత్తపుత్రుడని అనాల్సి వస్తుందని.. అలాగే చంచల్ గూడ షటిల్ టీం అంటూ హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 15 సీట్లు మాత్రమే వస్తాయని అన్నారు. అంతేకాకుండా రాసలీలల స్క్రిప్టు రెడీగా ఉందని, హీరోయిన్లు కూడా వారేనని, చందాలు వేసుకొని మరీ సినిమా తీస్తామని జన సైనికులు అన్నారు.
వైసీపీలో మాత్రమే ఉండే ఇలాంటి తిట్ల పురాణం ఇప్పుడు జనసేన కూడా పాటించడంతో వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. కేవలం సాధారణ విమర్శలు చేయడమే కాకుండా కాస్త రాష్ లాంగ్వేజెష్ ను వాడుతూ ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు కేవలం తమకు పోటీ టీడీపీనే అనుకున్న వైసీపీ తాజా పరిణామాలతో జనసేనను కూడా టార్గెట్ చేయడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.