Begin typing your search above and press return to search.

సత్తాచాటిన జనసేన..పాపం బీజేపీ

By:  Tupaki Desk   |   20 Sept 2021 11:45 AM IST
సత్తాచాటిన జనసేన..పాపం బీజేపీ
X
తాజాగా వెల్లడైన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో జనసేన తన సత్తాచాటిందనే చెప్పాలి. మిత్రపక్షాల్లో బీజేపీకన్నా జనసేనే గట్టి పార్టీగా నిరూపితమైంది. క్షేత్రస్ధాయిలో కమలంపార్టీ నేతలకు ఉన్న పట్టును తాజా ఫలితాలు స్పష్టంగా బయటపెట్టింది. బీజేపీ నేతలు ఎంతవరకు మీడియాముందు కూర్చుని సొల్లు చెప్పటం, పత్రికా ప్రకటనలకు పరిమితమవ్వటం, వీవీఐపీలను రిసీవ్ చేసుకుని సెండాఫ్ ఇవ్వటానికి ఎయిర్ పోర్టుల దగ్గర హడావుడి చేయటానికి మాత్రమే పనికొస్తారని తేలిపోయింది.

అసలే పార్టీకి జనాల్లో పట్టులేదు. దానికితోడు నేతల చేతకానితనం తోడైంది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నరేంద్రమోడి సర్కార్ కొడుతున్న దెబ్బలను జనాలు చాలా నిసితంగా గమనిస్తున్నారన్న విషయం అర్ధమవుతోంది. ఇదే సమయంలో బేజేపీ నేతలు, శ్రేణులు చేస్తున్న అనవసర రద్దాంతానికి కూడా జనాల మద్దతు లేదని తేలిపోయింది. గుళ్ళు, విగ్రహల ధ్వంసం వెనుక ప్రభుత్వమే ఉందని బీజేపీ చీఫ్ సోమువీర్రాజు అండ్ కో ఎంత గోల చేస్తున్నారో అందరు చూస్తున్నదే.

నిజానికి విగ్రహాల ధ్వంసానికి జగన్మోహన్ రెడ్డి మీద బురదచల్లేస్తున్నారు కమలనాదులు. ఇలాంటి అనేక కారణాల వల్లే జడ్పీటీసీగా కానీ ఎంపీటీసీగా కానీ బీజేపీ రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కటంటే ఒక్క సీటులో కూడా గెలవలేదు. ఇక జనసన విషయం తీసుకుంటే చాలా నాయమనిపించింది. జనసేన నేతలు, శ్రేణులు కూడా అనవసర రాద్దాంతం చేయటంలో బీజేపీతో పోటీపడుతోంది.

అయినా ఎక్కడో క్షేత్రస్ధాయిలో కాస్తో కూస్తో పట్టుసంపాదించినట్లే కనబడుతోంది. దీనికి రెండు ప్రధాన కారణాలు కనబడుతున్నాయి. మొదటిది పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఛరిష్మ, రెండోది సామాజికవర్గం పరంగా కాపులు గ్రామస్ధాయిలో అక్కడక్కడ జనసేన వైపు మొగ్గుచూపినట్లు కనబడుతోంది. లేకపోతే 171 ఎంపీటీసీ స్ధానాలు వచ్చే అవకాశమేలేదు. సరే కారణాలు ఏవైనా బీజేపీ కూడా 28 ఎంపిటీసీ స్ధానాల్లో గెలిచింది లేండి.

మొదటినుండి జనసేనకు ఎంతోకొంత ఆదరణ ఉందని అనుకుంటున్న ఉభయగోదావరి జిల్లాల్లోనే ఇపుడు కూడా మెజారిటి ఎంపీటీసీ సీట్లొచ్చాయి. తూర్పుగోదావరిలో 87, పశ్చిమగోదావరిలో 60 స్ధానాల్లో జనసేన గెలిచింది. గుంటూరులో మరో 10 స్ధానాల్లో విజయం సాధించింది. రాయలసీమ జిల్లాలు చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురంలో అసలు బీణీయే కొట్టలేదని అనుకోవాలి. ఏదేమైనా బీజేపీతో పోల్చుకుంటే జనసేన బాగా సత్తా చాటిందనే అనుకోవాలి.