Begin typing your search above and press return to search.

ఖమ్మంలో 12 స్థానాలకు నామినేషన్లు వేసేసిన జనసేన

By:  Tupaki Desk   |   19 April 2021 6:32 AM GMT
ఖమ్మంలో 12 స్థానాలకు నామినేషన్లు వేసేసిన జనసేన
X
ఖర్చు లేని మాటలెన్నో చెప్పుకోవచ్చు. బీజేపీ మిత్రుడిగా వ్యవహరిస్తూ.. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల బరిలో సీరియస్ గా దిగాలన్న యోచనలో ఉన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గత ఏడాది చివర్లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి.. చివరి క్షణంలో మిత్రుడి మాటతో వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. తాజాగా ముగిసిన తిరుపతి ఉప ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థిని నియమించకుండా.. బీజేపీ అభ్యర్థికి అవకాశం ఇవ్వటం తెలిసిందే.
ఇలాంటివేళ.. తాజాగా తెలంగాణలో జరుగుతున్న పలు కార్పొరేషన్లలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇందుకు తగ్గట్లే.. తాజాగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో జనసేన అభ్యర్థులు పన్నెండు డివిజన్లలో పోటీ చేస్తున్నారు. అయితే.. అధికారికంగా బీజేపీ పది స్థానాల్ని మాత్రమే కేటాయించింది. దీంతో.. జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

ఆదివారం నామినేషన్లకు చివరి రోజు కావటంతో.. పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేసిన వారిలో ఒక డివిజన్ కు ఇద్దరు నామినేషన్లు వేశారు. వారిలో ఒకరిని బరిలో నుంచి తప్పించాల్సి ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే..తాజాగానామినేషన్లు దాఖలు చేసిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. 60వ డివిజన్ అభ్యర్థిగా గుండా పవన్ కల్యాణ్ నామినేషన్ వేశారు. ఇంటి పేరును కాస్త పక్కన పెడితే.. పార్టీ అధినేత పేరుతో నామినేషన్ పడటం ఆసక్తికరంగా మారింది.

1. 02వ డివిజన్ - తూము ఉమామహేశ్
2. 08వ డివిజన్ - బొడా వినోద్
3. 13వ డివిజన్ - యాసా మురళీక్రిష్ణ
4. 14వ డివిజన్ - యాసంనేని అజయ్ క్రిష్ణ
5. 16వ డివిజన్ - బంగారు రామక్రిష్ణ, నల్లగట్ల శ్రీనివాసరావు
6. 23వ డివిజన్ - మిరియాల జగన్
7. 28వ డివిజన్ - భోగా హరిప్రియ
8. 36వ డివిజన్ - మైలవరపు మణికంఠ
9. 47వ డివిజన్ - గరదాసు సుమలత
10. 48వ డివిజన్ - ధనిశెట్టి భానుమతి.
11. 51వ డివిజన్ - సింగారపు చంద్రమౌళి
12. 60వ డివిజన్ - గుండా పవన్ కల్యాణ్