Begin typing your search above and press return to search.
ఏపీ సర్కారు నిర్ణయంపై పీకే ‘ఫైరింగ్’
By: Tupaki Desk | 6 May 2020 5:00 AM GMTవిమర్శించేందుకు ఏ మాత్రం అవకాశం చిక్కినా వదలకుండా అదే పనిగా ప్రెస్ నోట్లు రిలీజ్ చేయటంలో జనసేన టీంకున్నంత బలం మరెవరికి ఉండదేమో? సర్కారు తీసుకునే నిర్ణయాలతో పాటు.. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ ను ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నంతనే మీడియాకు ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేయటం పీకేకు ఒక రివాజుగా మారింది. తాజాగా ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని యుద్ధ ప్రాతిపదికన ఖండించే క్రమంలో పీకే ముందుంటారని చెప్పాలి.
తాజాగా ఏపీ సర్కారు ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. లాక్ డౌన్ వేళ నిబంధనల్ని కాస్త సడలించే క్రమంలో వివిధ రంగాలకు పాక్షికంగా అనుమతుల్ని ఇచ్చారు. ఏపీలో మద్యం అమ్మకాల వేళ.. భారీగా జనం చేరిన వైనంపై వాట్సాప్ కు ఎన్నో పోస్టులు షేర్ అవుతున్నాయి. ఇలాంటివాటికి బ్రేకులు వేసేందుకు వీలుగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విద్యార్థులకు చదువు సంధ్యలు నేర్పాల్సిన గురువులు.. బుధవారం నుంచి వైన్ షాపుల దగ్గర విధులు నిర్వర్తించాల్సిందిగా స్కూల్ టీచర్లకు ఆదేశాలు జారీ చేయటం సంచలనంగా మారింది.
విద్యాబుద్దులు నేర్పించే గురువులు.. ఇవాల్టి (బుధవారం) నుంచి మద్యం దుకాణాల వద్ద కాపలా కాయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. మద్యం అమ్మకాల కోసం విద్యార్థులకు చదువు సంధ్యలు చెప్పే గురువుల చేతనే విధులు నిర్వర్తిస్తూ ఇస్తున్న తీరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా తప్పు పట్టారు.
సమాజంలో టీచర్ ప్రొఫెషన్ కు ఉండే మర్యాద.. గౌరవం పాళ్లు ఎక్కువ. అలాంటి టీచర్లు ఇప్పుడు ఏకంగా మద్యం దుకాణాల వద్ద డ్యూటీ చేయాల్సి రావటం ఇబ్బందికరంగా మారటం ఖాయం. కొద్ది మంది టీచర్లకు మద్యం అలవాటే ఉండదు. అలాంటి వారికి తాజా ఆదేశాలు చుక్కలు చూపించటం ఖాయమని చెప్పాలి.
ఉపాధ్యాయులుగా ఉండే వారికి పని చెప్పాలన్నదే ప్రభుత్వ లక్ష్యమైతే.. పేదలకు అందాల్సిన ఆహారం.. ఇతర సదుపాయాల అమలు ఎలా ఉన్నాయన్న విషయాల్ని చెక్ చేయిస్తే బాగుండేది. అందుకు భిన్నంగా మద్యం దుకాణాల వద్ద డ్యూటీ వేయటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు పడుతున్న ఇబ్బందుల్ని గుర్తించిన పవన్ కల్యాణ్.. వారి తరఫున తన గళాన్ని వినిపించటం ద్వారా పొలిటికల్ మైలేజీకి కొత్త ఎత్తు వేశారన్న భావన వ్యక్తమవుతోంది.