Begin typing your search above and press return to search.
రెచ్చిపోయిన జనసేన నేతలు
By: Tupaki Desk | 30 Dec 2020 4:37 PM GMTమొట్టమొదటిసారిగా జనసేన నేతలు కలెక్టివ్ గా రెచ్చిపోయారు. తమ అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రులు కొడాలి నాని, పేర్నినాని, వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన విమర్శలపై జనసేన నేతలు ఒకేసారి అన్నీ వైపుల నుండి ఎదురుదాడులు మొదలుపెట్టారు. మామూలుగా అయితే మంత్రులను పవన్ విమర్శించటం, తర్వాత మంత్రులు పవన్ కు కౌంటర్ ఇవ్వటం మామూలుగా జరిగేదే. ఎప్పుడు కూడా పవన్ కు మద్దతుగా పార్టీలోని నేతలు ఇంతమంది ఒకేసారి ప్రత్యర్ధులకు విరుచుకుపడింది లేదనే చెప్పాలి.
అలాంటిది ఒక్కసారిగా ముగ్గురు నేతలు మంత్రులపై మాటలతో విరుచుకుపడటం ఆశ్చర్యంగా ఉంది. మంత్రుల హస్టరీ ఇదని, మంత్రులకు వార్నింగులంటు కౌంటర్ ఎటాకులతో రెచ్చిపోయారు. జనసేన నేత పోతుల మహేష్, అధికార ప్రతినిధి కూసంపూడి మాట్లాడుతూ కొడాలి నాని లారీ క్లీనర్ స్ధాయి నుండి మంత్రవ్వటం సంతోషంగానే ఉందన్నారు. కానీ భాష, వ్యవహారం మాత్రం ఇంకా క్లీనర్ స్ధాయిలోనే ఉండిపోయిందంటు ఎద్దేవా చేశారు.
వెల్లంపల్లి గురించి మాట్లాడుతూ మంత్రి తల్లి చనిపోతే మైల పాటించకుండా విధులు నిర్వర్తిస్తున్నట్లు ఆరోపించారు. అలాగే బాబాయ్ చనిపోయినా కూడా మైలపాటించని మంత్రి వల్లే రాష్ట్రానికి అరిష్టం పట్టుకుందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గురించి మాట్లాడుతూ నివర్ తుపాను వల్ల 17 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అసెంబ్లీలో చెప్పి ఇపుడు 11 లక్షల ఎకరాలకే నష్టపరిహారం చెల్లించటం ఏమిటంటు మండిపోయారు.
కొడాలినానీని పవన్ బోడిలింగం అనటం, తర్వాత కొడాలి మాట్లాడుతు పవనే బోడిలింగమని విరుచుకుపడటం అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని జనసేన నేతలు ప్రస్తావిస్తు కొడాలే బోడిలింగమంటు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందంటూ మండిపోయారు. మొత్తం మీద మొదటిసారి పవన్ కు మద్దతుగా జనసేన నేతలు ప్రత్యర్ధులపై రెచ్చిపోయారు.