Begin typing your search above and press return to search.

విజయవాడ నగరాన్ని కటౌట్లు - బ్యానర్లతో నింపేసారు

By:  Tupaki Desk   |   13 Nov 2018 3:03 PM GMT
విజయవాడ నగరాన్ని కటౌట్లు - బ్యానర్లతో నింపేసారు
X
అధికారం ఎవరి చేతిలో ఉంటే - అధికారులు వారి చేతులలో ఉంటారు. వారు చేసే పనులు కూడా ఆ కనుసన్నలలోనే నడుస్తాయి. ప్రజాస్వామ్మంలో ప్రతిపక్షాలది ఒకప్పుడు కీలక పాత్ర. అధికార పక్షంతో పాటు - ప్రతిపక్షాలకు ఎంతో కొంత విలువ ఉండేది. ఇప్పుడు ఆ సాంప్రదాయాలకు తిలోదాకాలు ఇచ్చేసారు. అది కేంద్రానికో లేక ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాలేదు. దేశంలో అన్ని రాష్ట్రాలలోను అదే పరిస్దితి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ లో ఉందంటున్నారు ప్రతిపక్ష నాయకులు. తమ పనులు చేసి పెట్టడం - తనకు అనకూలంగా వ్యవహరించడం వంటి పెద్ద పెద్ద కార్యక్రమాలను ప్రతిపక్ష నేతలు అడగడం లేదు.. కేవలం తమ సాధరాణ హక్కులను మాత్రమే పరిరక్షించండీ మొరో అని ఒక విధంగా వేడుకుంటున్నారు. సినీ రంగంలో ఓ వెలుగు వెలిగి భారీ కటౌట్ల కల్చర్‌ కు అలవాటు పడిన జనసేనాని పవన్ కల్యాణ్‌ కు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కాసింత ఆగ్రహం తెప్పిస్తోంది. గబ్బర్‌ సింగ్‌ కు కొత్తగా కటౌట్ల తిక్క పుట్టిస్తోంది. తన కటౌట్లకు లెక్క కావాల అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ లో 2019 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల వేడి రాజుకుంటోంది...నాయకులు ప్రచారానికి కావాల్సిన ఏర్పట్లు చేసుకుంటున్నారు.. ఇందులో బాగంగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కూడా సమాయత్వం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో అన్ని నగరాలు - పట్టణాలు - గ్రామాలలో పార్టీ కటౌట్లు - బ్యానర్లతో భారీ ప్రచారం చేయాలని జనసేన నాయకులకు - కార్యకర్తలకు ఆదేశించారు. అన్న చెప్పాడని తమ్ముళ్లు విజయవాడ నగరాన్ని కటౌట్లు - బ్యానర్లతో నింపేసారు.. అంతే అధికారులకు ఆగ్రహం వచ్చింది. అధికార పార్టీ ప్రతినిధుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో జనసేన కటౌట్ల తొలగింపు కార్యక్రమాన్ని భారీగా చేపట్టింది విజయవాడ అధికార యంత్రాంగం. నగరంలో జనసేన కటౌట్లు - ఫ్లేక్సీలు - బ్యానర్లు తొలగించే పనిని ప్రారంభించింది. ఈ చర్యను జనసేన నాయకులు - కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికార పార్టీ ఫ్లేక్సీలు - బ్యానర్లే ఉండాలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదా - ఇతర అంశాలే కాక ఇలాంటి ప్రచార ఆర్భాటాలకు అడ్డు తొలగడంపై కూడా జనసేన కన్నెరజేస్తోంది. మొత్తానికి పవన్ కల్యాణ్ రాజకీయాలలో రాటుదేలుతున్నారు.