Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రిపై జ‌న‌సైనికుల ఆగ్ర‌హం.. రీజ‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   10 Oct 2022 12:30 PM GMT
ఏపీ మంత్రిపై జ‌న‌సైనికుల ఆగ్ర‌హం.. రీజ‌న్ ఇదే!
X
"రాజ‌కీయంగా వైరం ఉంటే.. అవి రాజ‌కీయంగా నే చూడాలి. అంతే త‌ప్ప‌.. వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించుకుని .. వ్య‌క్తిగ‌త హ‌నానికి పూనుకోవ‌డం సమంజ‌సం కాదు.."-ఇది 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ నాయ‌కు లు ప్ర‌వ‌చించిన అద్భుత సందేశం. ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్‌ను వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేస్తున్న వారిని ఉద్దేశించి.. అప్ప‌ట్లో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, సాయిరెడ్డి వంటివారు చేసిన వ్యాఖ్య‌లు.. సూచ‌న‌లు ఇవి. అయితే.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ విష‌యాలు మ‌రిచిపోయిన‌ట్టుగా ఉంది.

అందుకే.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు.. ఇంట్లోని ఆడ‌వారిని కూడా రోడ్డుమీ దకు లాగుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. కొన్నాళ్ల కింద‌ట‌..టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు స‌తీమ‌ణి.. భువ‌నేశ్వ రిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అప్ప‌ట్లో ఇది తీవ్ర వివాదంగా మారిపోయింది. అయినా.. వైసీపీ నాయ‌కులు ఎక్క‌డా మార‌లేదు. తాజాగా మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ ..జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పై ఇలాంటి వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌లే చేశారు. మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిర‌క‌మ‌న్న జ‌న‌సేన‌పై విరుచుకుప‌డ్డారు.

అయితే.. రాజ‌కీయంగా చేయాల్సిన విమ‌ర్శ‌ల‌ను మంత్రి అమ‌ర్నాథ్‌.. జ‌న‌సేన‌నాని వ్య‌క్తిగ‌త జీవితంపై ఫోక‌స్ పెంచేలా చేశారు. "మియ్యావ్‌.. మియ్యావ్‌.. ద‌త్త‌పుత్రుడి మూడు రాజ‌ధానులు.. ఇవే" అంటూ.. ప‌వ‌న్‌పై స‌టైర్లు వేశారు.

'ఒక‌టి అంత‌ర్జాతీయ రాజ‌ధాని మాస్కో. రెండు జాతీయ రాజ‌దాని ముంబై, మూ డు ప‌ప‌క్క రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌' అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్య‌లు.. ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితానికి, ఆయ‌న వివాహాల‌కు సంబంధించి మంత్రి చేసిన‌ట్టుగా జ‌న‌సేన అభిమానులు మండి ప‌డుతున్నారు.

మంత్రి గుడివాడ తీరును జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా తిప్పి కొడుతున్నారు. ఏదైనా ఉంటే.. వ్య‌క్తిగ‌తంగా కాదు.. రాజ‌కీయంగా చూసుకోవాల‌ని.. నిప్పులు చెరుగుతున్నారు. మూడు రాజ‌ధానుల అంశం తేలి పోతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల నుంచి ఎలాంటిమ‌ద్ద‌తు లేద‌ని స్ప‌ష్ట‌మైన నేప‌థ్యంలోనే మంత్రి ఇలా దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని.. వారు మండి ప‌డుతున్నారు. మొత్తానికి వైసీపీ చెప్పిన సుద్దులు ఆ పార్టీనే మ‌రిచిపోయివ‌డంపై మేదావులు కూడా విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.