Begin typing your search above and press return to search.
ఇదీ జగన్ సంస్కారం, పవన్ కళ్యాణ్ అలా కాదు: రాపాక
By: Tupaki Desk | 25 Jun 2020 5:25 PM GMTగత ఎన్నికల్లో జనసేన నుండి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఆయన వైసీపీకి అనుకూలంగా ఉంటున్నారు. ఇటీవల కాపునేస్తం నిధుల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ జిల్లాల నేతలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్... అన్నా, రాపాకన్నా అంటూ పలకరించారు. సీఎం పిలుపుతో ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ తనను గుర్తుంచుకొని మరీ అన్నా అని పిలిచారని పొంగిపోయారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్, తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు తేడా ఉందని రాపాక చెబుతున్నారు.
జగన్‌కు తోటి ఎమ్మెల్యేలు, నాయకుల పట్ల ఉన్న అభిమానం, సంస్కారం అది అని, కానీ పవన్ కళ్యాణ్ తనను ఎప్పుడూ అలా అభిమానంతో పిలువలేదని అంటున్నారు. వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ఆయన వైసీపీ నేతలతో మాట్లాడుతూ భావోద్వేగానికి కూడా గురయ్యారట. తన అనుచరులకు చెప్పి ఉబ్బితబ్బిబ్బయ్యారట. జగన్‌లా ప్రేమగా పిలిచేవారు చాలా తక్కువగా ఉంటారని చెబుతున్నారట.
గత ఎన్నికల్లో జనసేన అధినేత రెండుచోట్ల నుండి పోటీ చేశారు. ఆయన సహా ఎవరూ గెలవలేదు. కేవలం రాపాక మాత్రమే విజయం సాధించారు. కానీ తాను గెలిచిన సమయంలో తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు కూడా సమయం తీసుకున్నారని గుర్తు చేసుకుంటున్నారట. నాదెండ్ల మనోహర్‌కు ఇచ్చిన ప్రాధాన్యత తనకు ఇవ్వడం లేదని కూడా గుర్తు చేసుకుంటున్నారట. ఓ పార్టీ సమావేశానికి తాను ఆలస్యంగా వచ్చినందుకు పవన్ కళ్యాణ్ ముందే నాదెండ్ల తనను వెటకారమాడారని చెబుతున్నారట. ఆ తర్వాత పార్టీలో పలుమార్లు అవమానాలు దిగమింగానని కూడా తన వాళ్ల వద్ద చెబుతున్నారట.