Begin typing your search above and press return to search.
జనసేన.. మళ్లీ పోటీచేద్దామా? వద్దా.?
By: Tupaki Desk | 11 May 2019 1:16 PM GMTఎన్నికల తర్వాత ఓడలు ఏవీ.. బండ్లు ఏవీ తేలిపోతుంది.. ఎన్నో ఆశలు పెంచుకున్న జనసేన పార్టీ పరిస్థితి ఏంటనేది కూడా తేలిపోతుంది. సార్వత్రిక ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన జనసేన ఇప్పుడు మరో పోరు రెడీ అవ్వబోతోంది. అయితే అది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే సీట్లే మీదే ఆధారపడి ఉంటుందని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.
ఏపీలో స్థానిక సంస్థలు - మున్సిపాలిటీలు - పంచాయతీ ఎన్నికలకు వేళయ్యింది. ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం తీవ్రంగా పోరాడిన కింది స్థాయి నేతలు ఇప్పుడు స్థానిక ఎన్నికలపై ఆశలు పెంచుకున్నారు. టీడీపీ - వైసీపీ కిందిస్థాయి నేతలు ఇప్పటికే సిద్ధమవుతున్నారు. పార్టీ పరంగా జరిగే ఎంపీటీసీ - జడ్పీటీసీ - మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ కిందిస్థాయి నేతలు కూడా ఆ పార్టీ తరుఫున పోటీచేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. జనసేన పార్టీలో కీలక నేతగా ఎదగడానికి, టీడీపీ - వైసీపీల్లో టికెట్ దక్కని వారికి జనసేనే ప్రత్యామ్మాయంగా కనిపిస్తోంది.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లోనే జనసేన ప్రభావం కొంత వరకే కనిపించింది. కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న చోట్ల మాత్రమే కాసింత ప్రభావం చూపింది. గోదావరి జిల్లాల్లో ఆ పార్టీకి బలం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానిక ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగే చాన్స్ ఉంటుంది.
అయితే స్తానిక ఎన్నికల బరిలో దిగాలంటే ముందుగా జనసేన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తుందనే దానిపైనే ఆధారపడి ఉండే చాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ సంతృప్తి చెందితేనే స్థానిక సంస్థల ఎన్నికల వైపు ఆలోచిస్తారని నాయకులు చెబుతున్నారు. లేదంటే పోటీపై అనుమానమే అంటున్నారు..