Begin typing your search above and press return to search.

పవన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన..షాతో భేటి..ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   11 Jan 2020 10:11 AM GMT
పవన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన..షాతో భేటి..ఏం జరుగుతోంది?
X
ఏపీ రాజకీయాల్లో అనూహ్యమైన మలుపు చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ సమావేశంలో ఉండగానే ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు రావడం ఆసక్తి రేపుతోంది. జనసేన కార్యవర్గ సమావేశం మధ్యలోనే వదిలేసి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి హడావుడిగా వెళ్లడం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఈ సాయంత్రం కలువబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పవన్ ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది. అమరావతి రాజధాని ఆందోళనలు జరగడం.. జగన్ కోర్టుకు హాజరుకావడం.. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ జోక్యం చేసుకోవడంతో ఈ పరిణామాలు వేగంగా మారుతున్నట్టు కనిపిస్తోంది.

అమరావతిలో శుక్రవారం పర్యటించిన పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. రాజధాని రైతులు రోడ్డెక్కడం ఆందోళన చేయడం బాధేస్తోందని.. మరోసారి అలా నష్టపోయే పరిస్థితి రాకూడదని పవన్ అన్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని.. చట్టప్రకారం ఏపీ రాజధాని విషయంలో కేంద్రానికి కూడా బాధ్యత ఉందని పవన్ అన్నారు. వెంటనే కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రాజధాని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇలా అమరావతి సమస్యపై ఎంత ఉద్యమించినా వర్కవుట్ కాలేకపోయేసరికి పవన్ కళ్యాన్ నిస్సహాయంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.. ఇక తాను ఏం చేయలేనని అమరావతి రైతులకు షాకిచ్చారు. కేంద్రమే తీర్చాలని ఉచిత సలహా ఇవ్వడంతో రాజధాని రైతులంతా షాక్ కు గురైన పరిస్థితి కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో అమిత్ షాతో ఈ సాయంత్రం భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో చంద్రబాబును తుత్తినియలు చేసి వైసీపీకి బలమైన ప్రతిపక్షంగా ఎదగాలని కేంద్రంలోని బీజేపీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ తో అమిత్ షా భేటి ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షా కనుక బీజేపీలో చేరాలని పవన్ ను ఆహ్వానిస్తారా? లేక పవనే ఆ ప్రతిపాదన చేస్తారా? ఏం జరగబోతుందనేది ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.