Begin typing your search above and press return to search.

డిజిట‌ల్ ముద్దా.జ‌నాలు ముద్దా.? జ‌న‌సేన‌లో ఇదేం ఫార్ములా రా బాబు..?

By:  Tupaki Desk   |   24 Dec 2021 6:34 AM GMT
డిజిట‌ల్ ముద్దా.జ‌నాలు ముద్దా.?  జ‌న‌సేన‌లో ఇదేం ఫార్ములా రా బాబు..?
X
డిజిట‌ల్ ముద్దా? జ‌నాలు ముద్దా? అంటే.. ఖ‌చ్చితంగా ఇప్పుడు జ‌న‌సేన పార్టీ మాత్రం డిజిట‌లే ముద్దు! అనే కామెంట్లు చేస్తోంది. దీనికి కార‌ణం.. పార్టీ ఇప్పుడు డిజిట‌ల్ మాధ్యమాన్ని తీవ్రంగా న‌మ్ముకుంది. ఏ కార్య‌క్ర‌మ‌మైనా.. ఇప్పుడు డిజిట‌ల్ రూపంలోనే జ‌న‌సేన జనం ముందుకు తీసుకువెళ్తోంది. ఇప్పుడు ఈ ప‌రిస్థితే.. పార్టీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఎందుకంటే.. ఏ పార్టీ అయినా.. ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకునే ముందుకు సాగాలి. అయితే.. డిజిట‌ల్‌లో మాత్రం జ‌నాలే క‌దా.. ఉండేది..అనే మాట వినిపిస్తుంది. ఇక్క‌డ కూడా ..ప్ర‌జ‌ల‌నే క‌దా క‌లుస్తున్నాం.. కాబ‌ట్టి బాగానే ఉంటుంద‌ని పైనుంచి.. సందేశం వ‌స్తోంది.

కానీ, క్షేత్ర‌స్థాయిలో మాత్రం నాయ‌కులు మ‌రో మాట వినిపిస్తున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో డిజిట‌ల్ మాధ్యా లు గ్రామీణుల‌కుకానీ. న‌గ‌రంలోకి సగం మంది వ‌ర‌కు చేరువ కాలేద‌ని చెబుతున్నారు. నేరుగా టీవీలు చూసి తెలుసుకోవ‌డ‌మో.. లేక‌.. వార్త‌లు వీక్షించ‌డ‌మో చేస్తున్నార‌ని.. డిజిట‌ల్ మాధ్యామాలు.. అనుకున్న‌రేంజ్‌లో ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేద‌ని అంటున్నారు. పైగా.. డిజిట‌ల్ మాధ్యమం ఉన్న‌ప్ప‌టికీ.. అది యువ‌త‌కు మాత్ర‌మే క‌నెక్ట్ అయింద‌ని, దీనివ‌ల్ల ఓటు బ్యాంకు జ‌న‌సేన‌కు ఏమేర‌కు చేకూరుతుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అంటే.. డిజిట‌ల్ మీడియా కంటే.. నేరుగా ప్ర‌జ‌ల‌ను క‌లిసి వారితో మ‌మేకం అయితే.. ఓటు బ్యాంకు పెరుగుతుంద‌ని అంటున్నారు.

కానీ, పార్టీ అధినేత ప‌వ‌న్ మాత్రం డిజిట‌ల్‌కు ఎక్కువ గా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవ‌ల విశాఖ ప‌ట్నం ఉక్కు క‌ర్మాగారం ప్ర‌వేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా.. ఒక రోజు దీక్ష అయితే.. చేశారు. దీనికి కొన‌సాగింపుగా.. రాష్ట్ర వ్యాప్తంగా నాయ‌కులు దీక్ష చేస్తామ‌ని.. ముందుకు వ‌చ్చారు. కానీ, ప‌వ‌న్ వెనుక‌డుగు వేశారు. దీనిని డిజిట‌ల్ రూపంలో తీసుకువెళ్తామ‌ని.. చెప్పారు. అనుకున్న‌ట్టుగానే తీసుకువెళ్లారు.కానీ, రిజ‌ల్ట్ క‌నిపించ డం లేదు. ఇక‌, అంత‌కు ముందు.. అక్టోబ‌రు 2న శ్ర‌మ‌దానం పేరుతో రోడ్ల గుంత‌లు పూడ్చేకార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు.

అయితే.. దీనికి కూడా కొన‌సాగింపు ఇవ్వ‌కుండా.. డిజిట‌ల్ లోకి తీసుకువెళ్లారు. ఎక్క‌డెక్క‌డ గుంత‌లు ఉంటే.. వాటిని ఫొటోలు తీసు పెట్టాల‌ని పిలుపునిచ్చారు. దీంతో భారీ ఎత్తున జ‌న‌సైనికులు స్పందించి.. ఫొటోలు అప్‌లోడ్ చేశారు. అయితే. దీనికి కూడ ప్ర‌జ‌ల నుంచి ఆశించిన మేర‌కు స్పంద‌న రాలేదు. అంటే.. ప్ర‌జ‌ల్లోకి వెళ్తేనే నేరుగా స్పంద‌న వ‌స్తుంద‌ని.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు చెబుతున్నా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం డిజిట‌ల్ ముద్ద‌ని అంటున్నారు. మ‌రి ఆయ‌న వ్యూహం ఏంటో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.