Begin typing your search above and press return to search.

పవన్ గుచ్చేశారుగా : వైసీపీ అవినీతి మీద యాప్ ఎక్కడ సారూ...?

By:  Tupaki Desk   |   6 Jun 2022 4:13 PM GMT
పవన్  గుచ్చేశారుగా : వైసీపీ  అవినీతి మీద యాప్ ఎక్కడ సారూ...?
X
నాకు కొంచెం తిక్క ఉంది. దానికో లెక్క ఉంది అని ఇప్పటికి పదకొండేళ్ళ క్రితం గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ పేల్చిన పంచ్ డైలాగ్ ఈ రోజుకీ ఎవర్ గ్రీన్ గానే ఉంటుంది. కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ పవన్ మార్క్ పంచులు కొన్ని పదులు ఉంటాయి.

ఆయన సభలలో ఆవేశంతో ఊగిపోతూ భయం అంటే ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు చూపిస్తాను అంటూ పేల్చిన పంచ్ ఎంత కేక పెట్టించిందో అందరికీ తెలుసు. మీ బలుపు తీరుస్తా. మీ సంగతి తేలుస్తా అంటూ ఆవిర్భావ సభ వేదికగా పవన్ వైసీపీ నేతల మీద వాడి వేడి డైలాగులు వాడినా వచ్చే రెస్పాన్స్ వేరే లెవెల్ లో ఉంటుంది.

ఇక చేతిలో ట్విట్టర్ ని ఉంచుకుని దాన్నే గబ్బర్ సింగ్ గన్ మాదిరిగా ప్రయోగించడంతో పొలిటికల్ స్టార్ పవన్ దిట్ట. ఆయన ట్విట్టర్ పేల్చే పంచ్ డైలాగులకు లెక్కే లేదు. వైసీపీ తిక్క తీర్చడానికే ఈ లెక్కలేనితనం అని చెప్పకనే చెబుతూ పవన్ ట్వీట్లు సైలెంట్ గా చేసి మంట పెట్టేస్తారు.

ఇపుడు అలాంటి అదిరిపోయే ట్వీట్ పవన్ నుంచి వచ్చింది. నిజంగా ఇది నేరుగా జగన్ కే టార్గెట్ చేసేలా ఉంది. ఈ మధ్య జగన్ ఏపీలో అవినీతి లేకుండా చూసేందుకు ప్రత్యేకమైన యాప్ ని ఒక దాన్ని రిలీజ్ చేశారు. ఎక్కడ అవినీతి జరిగినా ఈ యాప్ కి ఫిర్యాదు చేయలని కూడా కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు ఏసీబీ 14400 అనే యాప్‌ను డిజైన్ చేశారన్న మాట. ఈ యాప్‌ను యాంటీ కరప్షన్ బ్యూరో అభివృద్ధి చేసింది. దీని ప్రత్యేకత ఏమిటి అంటే ప్రజలు ఈ యాప్‌లో అధికారులపై అవినీతికి సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేయవచ్చు.

ఇక ఈ యాప్‌ను ప్రారంభించిన సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలనకు ఇదో విప్లవాత్మకమైన చర్య అన్నారు. సరిగ్గా ఇక్కడే పాయింట్ పట్టుకున్నారు పవన్. నేరుగా సీఎం సార్ కే గురిపెడుతూ అంతా బాగానే ఉంది. ఓకేగా ఉంది కానీ మరి వైసిపి పాలకుల అవినీతి గురించి ,వారి ఎమ్మెల్యేల దోపిడీ సహా దౌర్జన్యాల మీద కంప్లైంట్లు చెయ్యాలంటే ప్రజలు ఏ యాప్ప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి సారూ అంటూ పవన్ ట్వీటిన తీరు నిజంగా గ్రేటే గేటు అంటున్నారు అంతా.

అవును కదా అది నిజమే కదా. సరైన పాయింటునే పట్టుకుని లాజిక్ తో జనసేనాని వైసీపీ పెద్దల కూసాలు కదిలిపోయేలా ట్వీట్ చేశారు కదా అని అంటున్నారు. అధికారులు తప్పు చేస్తే యాప్ ఉంది. మరి ప్రజా ప్రతినిధులు తప్పు చేస్తే కూడా యాప్ ఉండాలి కదా. ఏమంటారు. మొత్తానికి ఇలాంటివి పట్తుకుని కెలికి వదిలిపెట్టడంతో జనసేనాని స్పెషాలిటీని వేరేగా చెప్పాలా.