Begin typing your search above and press return to search.

జ‌నసేన నేత‌ల‌కు ప‌వ‌న్ క్లాస్‌...రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   1 Nov 2022 2:30 AM GMT
జ‌నసేన నేత‌ల‌కు ప‌వ‌న్ క్లాస్‌...రీజ‌నేంటి?
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పార్టీ నాయ‌కుల‌కు భారీగానే క్లాస్ తీసుకున్నారు. మంగ‌ళగిరిలో జ‌రుగుతున్న రెండో పీఏసీ(పార్టీ పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ) మీటింగ్‌లో కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా కార్య‌క‌ర్త‌ల‌కు బాగానే త‌లంటారు. త‌న‌ను తిడుతుంటే. మీరు ఏం చేస్తున్నారు? అంటూ నిల‌దీశారు. ఎదురు స‌మాధానం ఎందుకు చెప్ప‌లేక పోయార‌ని ప్ర‌శ్నించారు. నాయ‌క‌త్వం అంటే తెల్ల‌చొక్కా వేసుకోవ‌డం కాదన్నా రు. మ‌న‌ల్ని అనేవాళ్ల‌ను.. తిట్టేవాళ్ల‌ను ఎదురుతిరిగి.. ఏంట్రా మాట్లాడుతున్నావ్‌? అని అడిగితేనే క‌దా నాయ‌త్వం!! అని పేర్కొన్నారు.

ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ స‌హా జ‌న‌సేన‌పై వైసీపీ నాయ‌కుల కామెంట్లు పెరిగిపోయాయి. మూడు పెళ్లిళ్లు.. ద‌త్త‌పుత్రుడు.. బానిస సేన నాయ‌కుడు.. అంటూ ఇలా అనేక రూపాల్లో వైసీపీ నాయకుల నుంచి తీవ్ర‌స్థాయిలో ఎదురు దాడి వినిపిస్తోంది. అయితే, రాష్ట్రంలో ఉన్న జ‌న‌సేన ఇంచార్జ్‌లు కానీ, కీల‌క నాయ కులు కానీ దీనిపై ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. అంతేకాదు.. కౌంట‌ర్ ఎటాక్ కూడా ఇవ్వ‌డంలేదు. ఎప్పుడైనా ప‌వ‌న్ వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే రాజ‌కీయంగా జ‌న‌సేన‌లో కొంత ఊపు వ‌స్తోంది. ఆయ‌న ఉన్నంత వ‌ర‌కు ఏదైనా కౌంట‌ర్ ఎటాక్‌లు ఉంటున్నాయి.

ఇక ప‌వ‌న్ క‌నుక వెళ్లిపోతే, జ‌న‌సేన గురించి మాట్లాడే నాయ‌కుడు లేకుండా పోతున్నాడు. దీంతో వైసీపీకి గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చేవారు లేర‌నే వాద‌న వినిపి స్తోంది. ఇదే వైసీపీ నాయ‌కుల‌కు బ‌లంగా కూడా మారింది. ఏమ‌న్నా ఎవ‌రూ మాట్లాడ‌ర‌నే భావ‌న‌తోనే జ‌న‌సేన‌పై విరుచుకుప‌డుతున్నార‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.

ఎందుకు ప‌డాల‌ని పార్టీ ఇంచార్జ్‌ల‌ను ప్ర‌శ్నించారు. ఇక‌పై ఇలా ఉండ‌డానికి వీల్లేద‌ని.. మాట‌కు మాట స‌మాధానం చెప్పితీరాల‌న్నా.. వాళ్లు ఏ భాష వాడితే మ‌న‌మూ అదే భాష వాడ‌దాం.. అని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇప్ప‌టి వ‌ర‌కుఉన్న స్త‌బ్ద‌త‌ను పోగొట్టేలా ప‌వ‌న్ క్లాస్ తీసుకోవ‌డం ఆశించద‌గిన ప‌రిణామ‌మ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.