Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ అటు వైపు న‌రుక్కొచ్చేస్తున్నారా...!

By:  Tupaki Desk   |   11 Jan 2023 4:17 AM GMT
ప‌వ‌న్ అటు వైపు న‌రుక్కొచ్చేస్తున్నారా...!
X
జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీలో రెండు కీల‌క ప్రాంతాల‌ను టార్గెట్ చేస్తున్నారు. ఒక‌టి ఉత్త‌రాంధ్ర‌, రెండు సీమ. సీమ‌లో జ‌న‌సేనాని పాద పెట్టినా.. టీడీపీకి అభ్యంత‌రం లేదు. ఎందుకంటే.. సీమ‌లో ఇప్పుడు వైసీపీ బ‌లంగా ఉంది. సో.. ఇక్క‌డ ఏదైనా డ్యామేజీ జ‌రిగితే..వైసీపీకే న‌ష్టం. కాబ‌ట్టి.. ఇది టీడీపీకి లాభిస్తుంది. అయితే.. ఉత్త‌రాంధ్ర‌లో మాత్రం.. టీడీపీ నేత‌లు త‌ట‌ప‌టాయిస్తున్నారు.

ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళం, విశాఖ‌ప‌ట్నం జిల్లాలు.. టీడీపీకి కంచుకోట‌లుగా ఉన్నాయి. అదేస‌మ‌యంలో విజ‌య‌న‌గ‌రంలోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ బ‌లంగా ఉంది. ఇక్క‌డ జ‌న‌సేన చేస్తున్న రాజ‌కీయం టీడీపీని న‌ష్ట‌ప‌రిచేలా క‌నిపిస్తోంది. ఇదిలావుంటే.. జ‌న‌సేన వ్యూహం వేరేగా ఉంది. ముందు త‌మ అవ‌స రం ఎక్క‌డ ఉంద‌ని అనుకుంటే.. అక్క‌డ పావులు క‌దుపుతోంది.

గ‌తంలో శ్రీకాకుళంలోని ఉద్దానం కిడ్నీ స‌మ‌స్య‌పై పోరాటం చేసినందున‌.. ఇక్క‌డ త‌మ పార్టీకి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తార‌నే భావ‌న క‌నిపిస్తోంది.

ఇక‌, విశాఖ‌లోనూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల‌కు మ‌ద్ద‌తుగా జ‌న‌సేనాని నిలిచారు. రాబోయే రోజుల్లో ఈ స‌మ‌స్య‌ల‌ను మ‌రింత విస్తృతంగా తీసుకుని.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని.. త‌ద్వా రా.. ఇక్క‌డ ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవాల‌ని జ‌న‌సేన భావిస్తోంది.

ఇక‌, సీమ విష‌యానికివ‌స్తే.. క‌ర్నూలు, అనంత‌పురంలో జ‌న‌సేన‌కు యువ త‌మ‌ద్ద‌తు ఎక్కువ‌గా ఉంది. ముఖ్యంగా ప‌వ‌న్ అభిమాన సంఘాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. వీరంతా కూడా త‌మ‌వెంటే ఉంటార‌ని.. ఆ పార్టీ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

ఈ క్ర‌మంలో కోస్తాను వ‌దిలేసినా.. ఈ రెండు ప్రాంతాల‌ను మాత్రం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నారు. ఇటీవ‌ల కౌలు రైతుల‌కు నిధుల పంపిణీ కూడా.. ఈ ప్రాంతంలోనే ఎక్కువ‌గా చేప‌ట్టారు. మొత్తానికి జ‌న‌సేనాని ఈ రెండు ప్రాంతాల‌ను ప్రాతిప‌దిక‌గా చేసుకుని ముందుకు సాగుతున్నార‌ని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.