Begin typing your search above and press return to search.
ఆ నేతలే ప్రజారాజ్యాన్ని విలీనం చేయించారు: పవన్ హాట్ కామెంట్స్!
By: Tupaki Desk | 20 Aug 2022 1:34 PM GMTకడప జిల్లాలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో ఉన్న నాటి కాంగ్రెస్ పార్టీ నేతలే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేలా ఒత్తిడి చేశారని పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రజారాజ్యం పార్టీ ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదని.. రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకునేవారు కాదని తెలిపారు.
రాజంపేట నియోజకవర్గంలోని సిద్ధవటంలో ఏర్పాటు చేసిన రచ్చబండ సభలో పవన్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కడప జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల్లో రెడ్లే ఉన్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రెడ్లు బాగు పడ్డారని అంతా అనుకుంటారని.. కానీ అది వాస్తవం కాదన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో రెడ్లకు సైతం ఎలాంటి మేలు జరగడం లేదని తెలిపారు.
ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు జగన్ ప్రభుత్వం సాయం చేయడం లేదు కాబట్టి తాను చేస్తున్నానని తెలిపారు. పద్యం పుట్టిన ప్రాంతంలో మద్యం ఏరులైపారుతోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి ఉద్యోగం ఏమోకానీ ఇంటింటికీ చీప్ లిక్కర్ మాత్రం వస్తోందని స్థానిక యువత చెబుతున్నారని పవన్ అన్నారు. ఒకప్పుడు సిద్ధులు సంచరించిన రాజంపేట ప్రాంతంలో ప్రస్తుతం పేదరికం తాండవిస్తోందని వాపోయారు. తనది వ్యక్తులపై పోరాటం కాదని.. సిద్ధాంతాలపైనే తన పోరాటం అని పవన్ చెప్పారు.
ప్రజలు ఎవరి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం ఉపాధి చూపాలన్నారు. ప్రభుత్వం అలా చేయకపోతే ఎంత చదువుకుని ఉండి ఏం లాభమని పవన్ ప్రశ్నించారు. పేదరికానికి ఏ కులం ఉండదన్నారు. కుల రాజకీయాల కోసం తాను జనసేన పార్టీని స్థాపించలేదని మరోసారి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కుల రాజకీయాల గురించి తాను ఆలోచించనన్నారు. వారసత్వ రాజకీయాలకు కొంత మేరకైనా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని పవన్ స్పష్టం చేశారు. అన్నికుల్లాలో పేదలున్నారని గుర్తు చేశారు. కులం, మతం, ప్రాంతం దాటి వచ్చిన మనిషిని తానని పవన్ కల్యాణ్ ప్రకటించుకున్నారు.
కుల, మతాలతో రాజకీయం చేస్తే దేశం విచ్చిన్నం కావడం ఖాయమన్నారు.
అన్న పట్టించుకోకపోవడంతోనే చెల్లెలు వేరే రాష్ట్రంలో పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. రాయలసీమలో బడుగు, బలహీన వర్గాల గురించి ఎవరూ ఆలోచించలేదన్నారు. జనసేన పార్టీని గెలిపిస్తే ఈ పరిస్థితిని మారుస్తామన్నారు.