Begin typing your search above and press return to search.

2024-2029 ఏది కావాలి ప‌వ‌న్ స‌ర్...!

By:  Tupaki Desk   |   28 Nov 2022 4:05 AM GMT
2024-2029 ఏది కావాలి ప‌వ‌న్ స‌ర్...!
X
వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రో ఏడాదిన్న‌ర స‌మ‌యం మాత్ర‌మే ఉంది. వ‌చ్చే ఎన్నిక‌లను కీల‌కంగా భావిస్తున్న వైసీపీ, టీడీపీలు జోరుగా వ్యూహం ప్ర‌తివ్యూహాల‌తో ముందుకు సాగుతున్నాయి. ఇదే దూకుడుతో జ‌న‌సేన కూడా ముందుకు సాగుతుంద‌ని అనుకుంటు న్నారు. ఇదే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ప‌దే ప‌దే చెబుతున్నారు. దీంతో జ‌న‌సేన శ్రేణులు కూడా ఆస‌క్తిగా ఎప్పుడు ఎన్నిక‌లు వ‌స్తాయా? అని ఎదురు చూస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యం అంటూ ప‌వ‌న్ చెప్పుకొస్తున్నారు.

ఇటీవ‌ల విజ‌య‌న‌గ‌రంలోనూ ఇదే మాట చెప్పారు. ఒక్క చాన్స్ ఇవ్వాల‌ని కూడా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు విన్నవించారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ప‌వ‌న్ కూడా సీరియ‌స్‌గా తీసుకున్నార‌నే టాక్ జ‌న‌సేన‌లో వినిపించ‌డం ప్రారంభ‌మైంది.

క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు ఉన్నా లేకున్నా.. పార్టీని గ‌ట్టెక్కించాల‌నే వ్యూహం ఉంద‌ని ప‌వ‌న్ చెప్ప‌గానే పార్టీ నాయ‌కులు ఒకింత సంతోషం వ్య‌క్తం చేశారు. అయితే, అదేంటో త‌న ప్ర‌సంగంలో ఒక ప‌ద్ధ‌తి లేన‌ట్టుగానే ప‌వ‌న్ త‌న ల‌క్ష్యాన్ని కూడా మార్చుకున్న‌ట్టు తెలుస్తోంది.

తాజాగా ఇప్పటం గ్రామంలోని ఇళ్లు కూలిపోయిన బాధితుల‌కు ఆయ‌న రూ.ల‌క్ష చొప్పున సాయం చేసే కార్య‌క్ర‌మంలో వారిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సుదీర్ఘ ప్ర‌సంగంలో ఒక్క అంశంపైనా క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డం ఒక ఎత్త‌యితే.. త‌న ల‌క్ష్యం విష‌యం లోనూ ఆయ‌న పార్టీ నేత‌ల‌ను, క్షేత్ర‌స్థాయి కార్య‌క‌ర్త‌ల‌ను, త‌న‌నే న‌మ్ముకున్న‌వారిని కూడా డోలాయ‌మానంలో ప‌డేశారు. ఇప్ప‌టికిప్పుడు అధికారంలోకి వ‌చ్చేయాల‌ని తాను భావించ‌డం లేదంటూ.. చేసిన ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నం సృష్టించింది. త‌ను 25 ఏళ్ల సుదీర్ఘ ల‌క్ష్యం పెట్టుకుని వ‌చ్చాన‌న్నారు.

అదే స‌మ‌యంలో 2008లోనే పార్టీకి అంకురార్ప‌ణ జ‌రిగినా.. 2014లోనూ పోటీకి దిగ‌లేద‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు ఎలా చేయాలి? రాజ‌కీయాలుఎలా ఉండాలి? అనే విష‌యాల‌పైనే తాను దృష్టి పెట్టాన‌న్నారు.

ఈ క్ర‌మంలో ఈ ల‌క్ష్య సాధ‌న‌.. 2024 అవుతుందా.. 2029 అవుతుందా.. అనేది ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌చ్చేది కాద‌ని.. ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డ‌మే ప్ర‌ధానమ‌ని.. వారికి మేలు చేయ‌డ‌మే వారి ప‌క్షాన మాట్లాడ‌డ‌మే ముఖ్య‌మని తేల్చిచెప్పారు. దీంతో ప‌వ‌న్ ల‌క్ష్యంపై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. అస‌లు 2024ను సీరియ‌స్గా తీసుకుంటున్నారా? లేక 2029 వ‌ర‌కు ఆగాలా? అనేది నేత‌ల్లో డౌట్ ఏర్ప‌డిపోయింది. ఇదీ.. సంగతి..!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.