Begin typing your search above and press return to search.
ఇంకో ఐదు జిల్లాల్లో జనసేన శిబిరాలు
By: Tupaki Desk | 30 May 2017 10:59 AM GMTఅధికారం కోసం కంటే ప్రశ్నించేందుకు ప్రజల్లోకి వచ్చామని ప్రకటించి తనతో నడిచే వారి విషయంలో ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో మరో ముందడుగు వేశారు. ఉత్తరాంధ్ర - గ్రేటర్ హైదరాబాద్ లలో జనసేన నిర్వహించిన ప్రతిభా పాటవ ఎంపికల శిబిరాలను విజయవంతంగా పూర్తి చేసిన జనసేన మరో ఐదు జిల్లాల్లో జనసేన శిబిరాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయింది. ఈ క్రమంలో తాజాగా ఆ వివరాలను తెలియజేస్తూ జనసేన రథసారథి పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు.
``రాజకీయాలలో యువత - మేధావులను భాగస్వామ్యులుగా చేయాలని జనసేన తలపెట్టిన ఈ యజ్ఞానికి మీరు చూపుతున్న ఆదరాభిమానాలు ఎంతో విలువైనవిగా భావిస్తున్నాము. మీరు ఇస్తున్న ప్రోత్సాహంతో తెలుగు రాష్ట్రాలలోని మరో ఐదు జిల్లాల్లో ఈ శిబిరాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించాము. ఆదిలాబాద్ (పాత జిల్లా పరిధి), నిజామాబాద్ (పాత జిల్లా పరిధి), తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాము. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో వెలుగులు నింపాలని, దేశ రాజకీయాలను ప్రగతి వైపు మళ్లించాలని ఆశ, ధ్యాస ఉన్న ప్రతీ ఒక్కరు ఈ శిబిరంలో పాల్గొనడానికి అర్జులే. స్పీకర్ (వక్త), కంటెంట్ రైటర్, అనలిస్ట్ విభాగాలకు ఆన్ లైన్ లో తమ దరఖాస్తులు పంపడానికి జనసేన వెబ్ సైట్ లో లాగ్ ఆన్ అవ్వండి.`` అని పవన్ ప్రకటన విడుదల చేశారు.
``జనసేన ఆన్ లైన్ చిరునామా (యూ.ఆర్ .ఎల్ ) ఈ దిగువున పొందుపరుస్తున్నాము. 30 మే నుంచి జూన్ 3 తేది వరకు దరఖాస్తులు అప్ లోడ్ చేయవచ్చు. మరోసారి ఈ సమాచారాన్ని తెలుసుకోడానికి జనసేన ఫేస్ బుక్ పేజీ ను చూడండి. జైహింద్`` అని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ : https://www.janasenaparty.org/adilabaddistrict
నిజామాబాదు : https://www.janasenaparty.org/nizamabaddistrict
తూర్పుగోదావరి : https://www.janasenaparty.org/eastgodavaridistrict
ప్రకాశం : https://www.janasenaparty.org/prakasamdistrict
నెల్లూరు : https://www.janasenaparty.org/nelloredistrict