Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కు కర్మాగారంపై స్పందించిన జనసేన

By:  Tupaki Desk   |   5 Feb 2021 4:17 PM GMT
విశాఖ ఉక్కు కర్మాగారంపై స్పందించిన జనసేన
X
విశాఖ ఉక్కు కర్మాగారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆయన అదే బీజేపీ.. తాజాగా బడ్జెట్ లో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో విశాఖలో బీజేపీ తీరుపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.

ఈ క్రమంలోనే మిత్రపక్షం బీజేపీ చేస్తున్న ఈ ప్రతిపాదనను జనసేన పార్టీ తరుఫున పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడం విశేషం. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్టు జనసేన పార్టీ స్పష్టం చేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంటును కాపాడుకునేందుకు కృషి చేస్తామని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరుతానని పేర్కొన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, అమిత్ షా నడ్డాను కలిసి దీనిపై చర్చిస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.