Begin typing your search above and press return to search.
పవన్ మూడు పెళ్లిల్లపై జనసేన క్లారిటీ
By: Tupaki Desk | 2 May 2018 11:12 AM GMTజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలను దాదాపుగా పక్కన పెట్టేసిన ఆయన రాజకీయాల వైపే దృష్టిసారించారు. ఇందుకు నిదర్శనం 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి పార్టీ సర్వసన్నద్ధంగా ఉందని ప్రకటించడమే. పక్కాగా రూపొందిస్తున్న ఎన్నికల వ్యూహంతో ముందుకు వెళదామని పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేద్దామని స్పష్టం చేశారు. దీంతో పవన్ పొలిటికల్ జర్నీపై పూర్తి స్పష్టత ఇటు రాజకీయ నాయకులకు అటు పార్టీ క్యాడర్‌కు వచ్చేసింది. అయితే ఇదే సమయంలో పవన్‌పై ఎదురుదాడి కూడా జరుగుతోంది. అందులోకి వ్యక్తిగత అంశాలు కూడా తోడయ్యాయి.
పవన్ పై ఎదురుదాడి చేసే వారు అందులోనూ వ్యక్తిగత అంశాలను ప్రస్తావించే వారు ప్రధానంగా చెప్పేది ఆయన మూడు పెళ్లిల్ల గురించే. పవన్ మూడు వివాహాలు చేసుకున్నాడంటూ దానికి తమదైన కామెంట్‌ను జోడిస్తూ వారు విమర్శలు చేస్తుంటారు. అయితే ఈ కామెంట్ కు తాజాగా క్లారిటీ వచ్చింది. జనసేన పార్టీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ ఓ టీవీ చానల్ చర్చలో మాట్లాడుతూ భార్యతో కాపురం చేస్తూనే బయట లేడీ పార్ట్‌నర్స్ కలిగి ఉన్న రాజకీయ నాయకులు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారని పేర్కొంటూ అలాంటివి పవన్ కళ్యాణ్ చేయడం లేదని తెలిపారు. పవన్ మొదటి పెళ్లి విషయంలో అమ్మాయి కుటుంబం పెట్టిన షరతుల వల్లే వారు విడిపోయారని అన్నారు. `పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి చేసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు మా ఇంటికి ఇల్లరికం రండి అని పవన్ కళ్యాణ్‌ను అడగటంతో పాటు మరికొన్ని అభిప్రాయ బేధాల వల్ల వారి వైవాహిక బంధం నిలవలేదు. వారు కలిసి ఉన్నది ఒక నెల రోజులు మాత్రమే.` అని జనసేన ప్రతినిధి వివరించారు.
ఇక పవన్ రెండో పెళ్లి గురించి వెల్లడిస్తూ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతనే పవన్ మరో వివాహం చేసుకున్నారని జనసేన ప్రతినిధి తెలిపారు. అది కూడా దాదాపు పదేళ్ల పాటు ఒంటరి జీవితం గడిపిన తర్వాత అని పేర్కొన్నారు. అయితే వివిధ కారణాల వల్ల వీరు విడిపోయారని, అలా అని పవన్ పై రేణుదేశాయ్ ఎలాంటి ఆరోపణలు కూడా చేయలేదని గుర్తు చేశారు. వారు ఇప్పటికీ మిత్రుల వలే ఉన్నారని తమ పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని వివరించారు. అయితే విడాకులకు వేర్వేరు కారణాలు ఉంటాయని పేర్కొంటూ వాటి విషయంలో బయటి వారికి తెలిసింది తక్కువ అని పేర్కొన్నారు. కాగా, నలుగురు అయిదుగురు అమ్మాయిలతో కలిసి ఉంటాను. నా భార్యకు లేని సమస్య మీకు ఎందుకు? అని కర్ణాటక సీఎం ఒకరు చేసిన కామెంట్లను ఈ సందర్భంగా జనసేన ప్రతినిధి గుర్తు చేశారు.