Begin typing your search above and press return to search.

గ్రేటర్ బరిలో జనసేన

By:  Tupaki Desk   |   6 Nov 2015 5:11 AM GMT
గ్రేటర్ బరిలో జనసేన
X
గ్రేటర్ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయా? అంటే అవుననే చెబుతున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు. గ్రేటర్ ఎన్నికలు జనవరి 31లోపు పూర్తి చేయాల్సిన నేపథ్యంలో గ్రేటర్ లో ఎన్నికల సందడి షురూ అయ్యింది. ఎన్నికల్లో ఏయే పక్షాలు దిగుతాయి.. ఎవరి బలం ఎలా ఉంటుందన్న చర్చ మొదలైన సందర్భంలోనే తాజాగా గ్రేటర్ బరిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన దిగుతుందని చెబుతున్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ.. బీజేపీతో కలిసి జనసేన బరిలోకి దిగుతుందని చెబుతున్నారు. తన తొలి ఎన్నికల్ని మిత్రులతో బరిలోకి దిగనున్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన చర్చ గ్రేటర్ పరిధిలో భారీగా సాగుతోంది. ఇప్పటికే బీజేపీ వర్గాలు జనసేన అధినేత పవన్ తో చర్చలు జరిపినట్లుగా చెబుతున్నారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన రాజకీయ పార్టీగా అవతరించినా.. ఎన్నికల బరిలోకి మాత్రం దిగలేదు. ఇటీవల జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రిజిష్టర్ చేసింది. ప్రస్తుతానికి పార్టీకి గుర్తును కేటాయించనప్పటికీ.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తే స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తు ప్రకటిస్తామని పేర్కొంది.

తొలిసారి ఎన్నికల బరిలోకి దిగాలన్న ఆలోచన నేపథ్యంలో సొంతంగా పోటీ చేసే కన్నా.. బీజేపీ.. టీడీపీ కూటమిలో భాగస్వామిగా బరిలోకి దిగాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి అరంగేట్రం సోలోగా కాకుండా గ్రూప్ ద్వారా ఇవ్వనున్నారా? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి సరైన సమాధానం పవన్ పెదవి విప్పితేనే స్పష్టంగా తెలుస్తుంది.