Begin typing your search above and press return to search.
15 నియోజకవర్గాల్లో జనసేన విజయం ఖాయం
By: Tupaki Desk | 21 May 2022 6:30 AM GMTరాబోయే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 15 నియోజకవర్గాల్లో గెలుస్తుందని చెప్పారు. మీడియాతో మాట్లాడిన పవన్ రెండురోజుల్లో రెండురకాల ప్రకటనలు చేయటం గమనార్హం. గురువారం చౌటుప్పల్లో మీడియాతో మాట్లాడిన పవన్ ఏపీలోనే అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు ఇక తెలంగాణా గురించి ఏమి మాట్లాడుతాను అన్నట్లుగా చెప్పారు. రాబోయే తెలంగాణా ఎన్నికల్లో ఎన్నిసీట్లలో పోటీచేయాలో ఇంకా డిసైడ్ కాలేదన్నారు.
మొత్తం సీట్లలో ఓ 20 శాతం సీట్లలోనో లేకపోతే మూడోవంతు సీట్లలోనో పోటీచేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అదే శుక్రవారం మంగళగిరికి వచ్చేటప్పటికి తెలంగాణా ఎన్నికల్లో 30 నియోజకవర్గాల్లో బలంగా ఉందన్నారు.
కాబట్టి 30 సీట్లలో పోటీచేస్తామని 15 సీట్లలో కచ్చితంగా గెలుస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో తమపార్టీకి 5,6 వేల ఓట్లున్నట్లు చెప్పారు. ఒకసారి బీజేపీతో పొత్తుంటుందని, మరోసారి పొత్తులపైన ఏమీ చెప్పలేకపోయారు.
అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే పవన్లో పరస్పర విరుద్ధమైన ఆలోచనలు స్పష్టమవుతోంది. ఒకవైపు తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏమో జనసేనతో తమకు ఎలాంటి పొత్తులేదని స్పష్టంగా గతంలోనే ప్రకటించారు. ఇదే సమయంలో ఇపుడు పవన్ మాత్రం రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుంటుందని అర్ధం వచ్చేట్లుగా మాట్లాడారు. మొత్తంమీద పవన్ ప్రకటన కారణంగా ఇటు జనసేనలోనే కాదు అటు బీజేపీలో కూడా అయోమయం పెరుగుతోంది.
నిజంగానే పొత్తులు పెట్టుకోవాలని, తెలంగాణా ఎన్నికల్లో కచ్చితంగా పోటీచేసే ఉద్దేశ్యం ఉంటే ఆ విషయాన్ని బీజేపీ నేతలతో కూర్చుని మాట్లాడుకోవాలి. అప్పుడు రెండుపార్టీల్లోను ఒక స్పష్టత వస్తుంది. దాంతో జనాల్లో కూడా పొత్తుల విషయమై క్లారిటి ఉంటుంది.
అంతేకానీ తెలంగాణాలో ఒకమాట, ఏపీలోకి అడుగుపెట్టగానే మరోమాట మాట్లాడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని పవన్ గ్రహించాలి. ఈ విషయాన్ని పవన్ ఎంత తొందరగా గ్రహించి అంత తొందరగా కన్ఫ్యూజన్ తొలగించుకుంటే రెండుపార్టీలకు మంచిది. లేకపోతే రెండుపార్టీలు నష్టపోవటం ఖాయం. దీని ప్రభావం ఆటోమేటిగ్గా ఏపీ మీద కూడా పడటం ఖాయం.