Begin typing your search above and press return to search.
షాక్: కేటీఆర్ పై జనశక్తి రెక్కీ?
By: Tupaki Desk | 15 Oct 2018 5:05 AM GMTసంచలన విషయం బయటకు వచ్చింది. పోలీసుల అదుపులో ఉన్న జనశక్తి కార్యకర్తలు వెల్లడించిన సమాచారం ఇప్పుడు అధికార వర్గాల్లో ఆందోళన కలిగించటమేకాదు.. పోలీసులు.. నిఘా వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిస్థితి. తాజా మాజీ మంత్రి కేటీఆర్ పై జనశక్తి రెక్కీ నిర్వహించినట్లుగా చెబుతున్నారు.
ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద వెహికిల్స్ ను తనిఖీ చేస్తుండగా.. జనశక్తి జిల్లా కార్యదర్శి జక్కుల బాబుతో పాటు మరో మావో శ్రీకాంత్ లను పోలీసులు అదుపులోకి తీసుకుననారు. వారిని విచారించిన సందర్భంగా అవాక్కు అయ్యే విషయాన్ని వారు వెల్లడించారు.
తాము తాజా మాజీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేశామని.. అందుకు తగ్గ రెక్కీని చేపట్టినట్లుగా వెల్లడించారు. టూ వీలర్ మీద వెళుతున్న వీరి నుంచి మేడిన్ అమెరికాకు చెందిన సెమీ ఆటోమేటిక్ రివాల్వర్ ను.. 15 బుల్లెట్లను.. కొంత క్యాష్ ను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా తాము కేటీఆర్ పై రెక్కీని నిర్వహించినట్లుగా పోలీసుల దర్యాప్తులో బాబు చెప్పినట్లుగా చెబుతున్నారు.
ఇక.. పోలీసుల అదుపులో ఉన్న జక్కుల బాబు బ్యాక్ గ్రౌండ్ ను చూస్తే.. తంగెళ్లపల్లి మండలం చిన్న లింగాపూర్ గ్రామానికి చెందిన బాబు 2016లో జనశక్తి విప్లవ పార్ఈ ద్వారా అండర్ గ్రౌండ్ కి వెళ్లాడు. అతనికి జనశక్తి విప్లప పార్టీ ద్వారా ఒక ఆయుధాన్ని సమకూర్చినట్లుగా గుర్తించారు. కేటీఆర్ ను జనశక్తి టార్గెట్ చేసిన వైనం బయటకు రావటంతో పోలీసు యంత్రాంగం ఉలిక్కి పడటమే కాదు.. తగిన చర్యల మీద దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.