Begin typing your search above and press return to search.
వైసీపీలో జంగా రూటు.. సపరేటు.. కాసుకు చెక్ పెట్టడం ఖాయం!
By: Tupaki Desk | 27 Dec 2020 1:30 AM GMTవైసీపీ అధినేత జగన్ సీఎం కావడం వెనుక వైసీపీలోని అన్నివర్గాలు ఏవిధంగా అయితే.. పోరాడాయో.. అదేవిధంగా బీసీ నాయకుడు, గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి కూడా పోరాడారు. బీసీలను ఐక్యం చేయడంలోను, జగన్ వెనుక వారు ఉండేలా చేయడంలోను జంగా సక్సెస్ అయ్యారు. వాస్తవానికి గత ఏడాది ఎన్నికల సమయంలో టీడీపీ మహిళలు కేంద్రంగా ఓటు బ్యాంకు చీలుతుందని అనుకున్నారు. కానీ, బీసీ ఓట్లు వైసీపీకి పడేలా జంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అప్పటికే బీసీల అధ్యయనం కోసం.. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఉండడంతో అన్ని జిల్లాల్లోనూ బీసీలను సమైక్య పరిచారు. ఇది వైసీపీకి దన్నుగా మారి.. ఓట్ల వర్షం కురిపించింది. అనంతరం భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడింది.
గత ఎన్నికల్లో గుంటూరులోని కీలక నియోజకవర్గం గురజాల నుంచి జంగానే వైసీపీ తరఫున పోటీ చేయాలని అనుకున్నారు. దీనికి తగిన విధంగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే.. ఎన్నికలకు రెండు మాసాల ముందు.. అనూహ్యంగా జగన్ నిర్ణయం మారిపోయింది. దీంతో కాసు మహేష్ రెడ్డి రంగంలోకి దిగారు. జగన్.. జంగాకు సర్ది చెప్పి.. గురజాల టికెట్‌ను కాసుకు ఇప్పించారు. వాస్తవానికి టికెట్లు వదులుకున్న వారు భారీ యాగీ చేస్తుంటారు. కానీ జంగా మాత్రం చిరునవ్వుతో.. కాసుకు తన టికెట్ ఇచ్చేశారు. అంతేకాదు.. కాసుకు ప్రచారం కూడా చేసి పెట్టారు. ఇటీవల వైసీపీ సర్కారు 56 బీసీ కార్పొరేషన్లను ఇటీవల ఏర్పాటు చేసింది.