Begin typing your search above and press return to search.

గాల్వన్ ఘర్షణ: భారత్ కు జపాన్ మద్దతు.. చైనాకు వార్నింగ్

By:  Tupaki Desk   |   3 July 2020 11:10 AM GMT
గాల్వన్ ఘర్షణ: భారత్ కు జపాన్ మద్దతు.. చైనాకు వార్నింగ్
X
కరోనాను పుట్టించడమే కాదు.. ఇతర దేశాలపైకి చైనా దురాక్రమణ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆ దేశంపై వ్యతిరేకత పెల్లుబుకుతోంది. అదే సమయంలో భారత్ కు మద్దతు పెరుగుతోంది.

తాజాగా భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే జపాన్ దేశం భారత్ కు మద్దతు ప్రకటించింది. అదే సమయంలో చైనాకు గట్టి హెచ్చరిక పంపింది.

తాజాగా జపాన్ అంబాసిడర్ సతోషి సుజికీ భారత్-చైనా ఘర్షణలపై స్పందించారు. భారత్ కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని.. చైనాకు హెచ్చరికలు చేస్తున్నట్టు తెలిపారు. చైనా సరిహద్దుల్లో చేస్తున్న ప్రయత్నాలను జపాన్ వ్యతిరేకిస్తుందని సుజుకీ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన భారత్ కు మద్దతు తెలుపుతూ ఓ పోస్ట్ చేశారు.

తాజాగా భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ తో జపాన్ బ్రాండ్ అంబాసిడర్ సుజుకీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్, చైనాల మధ్య శాంతియుత పరిష్కారం దొరకాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. చైనా తీరును జపాన్ వ్యతిరేకిస్తుందని ఆయన తెలిపారు.