Begin typing your search above and press return to search.
ప్రతి ఒక్కరికి రూ.70వేలు చేతికి ఇస్తామన్న ప్రధాని !
By: Tupaki Desk | 19 May 2020 1:30 AM GMTప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్ మళ్లీ ఆర్థిక మాంద్యంలోకి జారిపోయింది. 2015కి ముందు జపాన్ లో ఆర్థిక మాంద్యం ఉంది. ఆ సమయంలో కోలుకున్న జపాన్ లో మళ్లీ ఇప్పుడు ఆర్థిక మాంద్యం వచ్చినట్లు సోమవారం షింజో అబే ప్రభుత్వం డేటా విడుదల చేసింది. గత క్వార్టర్ తో పోలిస్తే 2020-21 మొదటి క్వార్టర్ (జనవరి-మార్చి) లో వృద్ధి రేటు 0.9 శాతం తగ్గింది. అయితే ఎనలిస్ట్ ల అంచనా వేసిన 1.2శాతం తగ్గుదల కంటే కొంచెం బెటర్ గానే ఉంది. వరుసగా రెండు క్వార్టర్లో జపాన్ లో వృద్ధి రేటు తగ్గింది. రెండు క్వార్టర్లలో నెగెటివ్ వృద్ధి రేటు వస్తే... దాన్ని ఆర్థిక మాంద్యంగా జపాన్ లెక్కిస్తోంది.
పన్నుల పెంపు, తుఫాన్ల దాడి వంటి అంశాలు అందుకు కారణం అయ్యాయి. ఆ తర్వాత మహమ్మారి దెబ్బకు కార్యకలాపాలన్నీ నిలిచిపోయి ఆర్థికవ్యవస్థ అతలాకుతలం అయింది. జపాన్లో ఇవి టూరిజం రోజులు. ఈ మహమ్మారి కారణంగా 90 శాతం టూరిజం పడిపోయింది. టోక్యో 2020 ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. జపాన్ GDPలో సగానికి పైగా ఉండే వ్యక్తిగత వినియోగం 0.7శాతం పడిపోయింది. జపాన్ ఎకానమీకి పిల్లర్లుగా ఉన్న టొయోటా మోటర్ కార్పొరేషన్ వంటి మ్యానుఫ్యాక్చరర్స్ నిరాశాజనకమైన ఆర్థిక ఫలితాలను రిపోర్ట్ చేశాయి.
కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు జపాన్ ప్రభుత్వం ఇటీవల 76 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. చిన్న వ్యాపారులకు సహాయం చేయడం,జపాన్ ప్రజలకు ఒక్కొక్కరికీ రూ.70వేలు ఇవ్వడం వంటివి ఆ ప్యాకేజీలో భాగంగా ఉన్నాయి. చేతికి వచ్చే డబ్బును ప్రజలు ఖర్చు పెడితే... అప్పుడు ఎకానమీ పరుగులు పెడుతుందని షింజో అబే భావిస్తున్నారు. జపాన్ లో మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. జపాన్ లో ఇప్పటివరకు 16,285 మహమ్మారి కేసులు నమోదుకాగా, 744మరణాలు నమోదయ్యాయి. ఇక రికవరీ రేటు జపాన్ లో బాగానే ఉంది. దేశంలో 11,153మంది కరోనా నుంచి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతానికి జపాన్ లో యాక్టివ్ కేసులు 4388 మాత్రమే..అయితే , రోజురోజుకి కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే రాజధాని టోక్యోలో వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. టోక్యో, ఒసాకాలో లాక్ డౌన్ అమల్లో ఉంది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో గత వారం ఎమర్జెన్సీని ఎత్తివేశారు.