Begin typing your search above and press return to search.
సరోగసిపై జపాన్ చారిత్రాత్మక బిల్లు..పిల్లలపై పూర్తిహక్కులు తల్లిదండ్రులకే..!
By: Tupaki Desk | 17 Nov 2020 5:30 PM GMTవివిధ కారణాలతో పిల్లలు కనలేకపోతున్న వారికి సరోగసి ( కృత్రమ గర్భధారణ) అనేది ఓ వరమే అయినప్పటికి.. దీని వెనక అనేక చీకటి కోణాలు వ్యాపారాలు ముడిపడి ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తక్కువ వయస్సు ఉన్నవారికి గర్భదారణ చేయడంతో వారి కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే సరోగసి ద్వారా పిల్లలు పుడితే వారిపై హక్కులు ఎవరికి ఉంటాయనే దానిపై జపాన్లో వివాదం ఎదురైంది. పిల్లలు పెద్దయ్యాక ఆ పిల్లల పుట్టేందుకు వీర్యదానం, లేదా అండదానం చేసిన వారు మేమే అసలు తల్లిదండ్రులమంటూ ముందుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఇంత కాలం పిల్లలను పెంచి, పెద్దచేసిన తల్లదండ్రులు తీవ్ర సమస్యలు ఎదుర్కొనేవారు. ఈ విషయంపై జపాన్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే అక్కడి ప్రభుత్వం ఓ కీలక బిల్లును ఆమోదించింది. దాని ప్రకారం ఎవరైతే పిల్లలకు జన్మనిచ్చారో? ( అంటే సరోగసి ద్వారా పిల్లలను పొందినవారు) వారే అసలైన తల్లిదండ్రులని జపాన్ ప్రభుత్వం చట్టం చేసింది.
సరోగసీ ద్వారా పిల్లల్ని కంటే ఆ పిల్లలకు తల్లిదండ్రులు ఎవరు అనే అంశంపై ఎంతోకాలంగా అక్కడ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో విట్రో ఫర్టిలైజేషన్ ప్రక్రియతో జన్మించిన పిల్లల తల్లిదండ్రుల అంశంపై జపాన్ దేశ ప్రభుత్వం సరికొత్త బిల్లును రూపొందించింది. వీర్యం దానం చేసిన వారికి.. లేదా అండం దానం చేసిన వారికి పిల్లలపై ఎటువంటి హక్కులు ఉండవని.. వారిని పెంచి పెద్దచేస్తున్న తల్లిదండ్రులకు మాత్రమే పిల్లలపై సంపూర్ణ హక్కు ఉంటుందని అక్కడి ప్రభుత్వం తేల్చిచెప్పింది.
సరోగసీ పిల్లలకు తల్లిదండ్రులు ఎవరు? అనే అంశంపై జపాన్లో అనేక ఏండ్లుగా వివాదం నడుస్తోంది. ఈ చర్చల్లో వైద్య నిపుణులతో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు, కామన్ పీపుల్స్ కూడా పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకూ దానిపై స్పష్టత లేకపోవడంతో..ప్రభుత్వం దీనికో క్లారిటీ ఇచ్చేసింది.
అద్దెగర్భం (surrogacy) లేదా కృత్రిమంగా గర్భధారణ చేసే సమయంలో 3వ వ్యక్తి సాయం తీసుకోవడం ద్వారా కలిగే సంతానానికి చట్ట రీత్యా తల్లిదండ్రులు ఎవరనే అంశం సాగుతున్న మీమాంసకు తెరదించే ప్రయత్నంలో భాగంగా ఈ కొత్త బిల్లును అధికార, ప్రతిపక్షాలు కలిసి ఈ బిల్లును రూపొందించాయి. అధికార ప్రతిపక్షాలు కలిసి ఈ బిల్లును రూపొందించటం విశేషం. సరోగసీ ద్వారా బిడ్డల్ని కలిగినవారు ఆ బిడ్డకు జన్మ ఇచ్చిన వారే తల్లిదండ్రులంటూ కొత్త బిల్లులో పేర్కొంది. సాధారణంగా ఈ లిటిగేషన్లన్నీ 3వ వ్యక్తి ద్వారా అండం లేదా వీర్యం కొని తల్లిదండ్రులైన వారికి ఎదురవుతుంటాయి. దీంతో జపాన్ ప్రభుత్వం ఈ సమస్యకు ఫుల్స్టాప్ పెట్టింది. ప్రస్తుతం కొనసాగుతున్న డైట్ (Diet అంటే జపాన్ పార్లమెంట్) సమావేశాల్లోనే ఈ బిల్లును పాస్ చేసేందుకు అవసరమైన సంపూర్ణ మద్దతు ఉండటంతో డిసెంబరు నెలాఖరుకల్లా ఈ బిల్లు చట్టంగా మారనుంది.
దానం చేసినవారికి ఏ హక్కు ఉండదు..!
కొత్త బిల్లు ప్రకారం బిడ్డకు జన్మనిచ్చిన మహిళనే తల్లి హోదా పొందుతుంది. అయితే తమ పుట్టుకకు కారణమైన వీర్య దాతలు (sperm doner), అండ దాతల (egg doner) వివరాలను కూడా పిల్లలు తెలుసుకొనే అవకాశం లేదు.
దీనిపై విమర్శలకు వస్తున్నాయి. తమలో ఎవరి జీన్స్ ఉన్నాయో, తాము ఎవరి వల్ల పుట్టామో తెలుసుకునే అవకాశం పిల్లలకు లేకపోతే ఎలా అంటూ జపాన్ ఫెడరేషన్ ఆఫ్ స్పర్మ్ డోనర్స్ వాదిస్తోంది. జపాన్ లో ఒంటరి మహిళలు, పురుషుల సంఖ్య పెరుగుతుండగా మరోవైపు స్వలింగ సంపర్క వివాహాలు పెరుగుతున్నాయి. (దీనికి కారణం జపాన్ లో జననాలు తగ్గిపోతుండటం కూడా కారణమని నిపుణులు అంటున్నారు) ఇటువంటి వారు సంతానం పొందాలనుకుంటే స్పర్మ్ డోనర్స్ లేదా ఎగ్ డోనర్స్ ను ఆశ్రయించాల్సిందే.
ఈ నేపథ్యంలో అద్దె గర్భం లేదా స్పర్మ్ డోనర్స్, ఎగ్ డోనర్స్ కు రోజు రోజుకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. కానీ వీరి అవసరాలను స్పృశించేలా తాజా చట్టం లేకపోవడంతో పలు విమర్శలు కూడా వస్తున్నాయి. ఇటీవలి కాలంలో జపాన్ లో స్పర్మ్ బ్యాంకులకు డిమాండ్ పెరుగుతోంది. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్తబిల్లును ప్రతిపక్ష పార్టీ అయిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ మద్దతు ఇవ్వడం గమనార్హం.