Begin typing your search above and press return to search.
'రూట్' మారుస్తున్న జపాన్.. అణ్వస్త్రాలపై 'గురి'..!
By: Tupaki Desk | 18 Dec 2022 1:43 PM GMTరెండో ప్రపంచ యుద్ధానికి ముందు జపాన్ ఆయుధ సంపత్తిలో మేటిలో ఉండేది. ఒకనొక బ్రిటిష్ సైన్యాన్ని సైతం గడగడలాడించిన చరిత్ర జపాన్ కు ఉంది. అలాంటి జపాన్ పరిస్థితి రెండో ప్రపంచ యుద్ధంలో పూర్తిగా మారిపోయింది. ప్రపంచంలో అణుబాంబు దాడికి గురైన ఏకక దేశంగా జపాన్ నిలువడం శోచనీయంగా మారింది.
హిరోషిమా.. నాగసాకిలపై అమెరికా అణుబాంబు దాడితో జపాన్ అతలాకుతలమై సర్వస్వం కోల్పోయింది. అణుబాంబు దాడితో అమెరికాకు లొంగిపోయిన జపాన్ ఆ తర్వాత యుద్ధం జోలికి పోకుండా శాంతికాముక దేశంగా మారిపోయింది. తన ఆత్మరక్షణ మొత్తాన్ని అంతా అమెరికా చేతిలో పెట్టిన జపాన్ 70 ఏళ్లుగా యుద్ధం జోలికి వెళ్లలేదు.
అయితే అమెరికాపై పూర్తిగా ఆధారపడకుండా సొంతంగా సైన్యాన్ని బలోపేతం చేసుకునేందుకు జపాన్ నిర్ణయించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ జీడీపీలో రెండు శాతం రక్షణకు కేటాయించింది. రాబోయే ఐదేళ్లలో 300 బిలియన్ డాలర్లు ఆయుధాల కొనుగోలు చేసేందుకు ఖర్చు చేయనున్నట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది.
అమెరికా.. బ్రిటన్ నుంచి కొన్ని క్షిపణులు.. హైపర్ సోనిక్ ఆయుధాలు కొనుగోలు చేయడంతోపాటు మరికొన్నింటిని సొంతంగా తయారు చేయాలని అనుకుంటుంది. 1250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించే 500 క్రూయిజ్ క్షిపణులను జపాన్ సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు తమ పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు దేశవ్యాప్తంగా 70 ఆయుధ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాబోయే ఐదేళ్లలో వీటి సంఖ్య 130కి పెంచనుంది. జపాన్ ఉన్నట్టుండి రక్షణపై దృష్టి పెట్టడానికి సరిహద్దుల్లో యుద్ధ తాకిడే ప్రధాన కారణమని తెలుస్తోంది. పొరుగున ఉన్న చైనా.. రష్యా.. ఉత్తర కొరియాలు నిత్యం కవ్వింపులకు దిగుతుండటంతో జపాన్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఉత్తర కొరియా అణ్వస్త్రాలను సమకూర్చుకోవడమే కాకుండా పదే పదే క్షిపణులను ప్రయోగిస్తోంది. తైవాన్ విషయంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. దీంతో సుదూరంలో ఉన్న అమెరికాపై రక్షణ పరంగా ఆధారపడటం భవిష్యత్ లో మంచిది కాదని జపాన్ భావిస్తోంది. అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తూనే ఆత్మరక్షణ చర్యలను బలోపేతం చేసుకుంటోంది.
రక్షణ పరంగా జపాన్ అమెరికాపై ఆధార పడుతున్నప్పటికీ సొంతంగా 2లక్షల సైన్యాన్ని కలిగి ఉంది. వాయు.. పదాతి.. నౌక దళంలో వీరంతా పని చేస్తాయి. అయితే వీరిని జపాన్ సైన్యంగా కాకుండా ఆత్మరక్షణ దళంగా పిలుస్తుంది. వీరంతా కూడా యుద్ధ సమయంలో అమెరికా సైన్యానికి సాయంగా పని చేయనున్నారు.
జపాన్ వద్ద అణ్వస్త్రాలు లేకపోయినప్పటికీ వాటిని తయారు చేసుకోగల టెక్నాలజీ ఉంది. జపాన్ తలుచుకుంటే కొద్దిరోజుల్లోనే అణ్వస్త్రాలను సమకూర్చుకోగలదు. ఏదిఏమైనా ఇన్నాళ్లు శాంతి వచనాలు పలికినా జపాన్ ఆయుధాల విషయంలో రూట్ మారుస్తుండటం ఆసక్తిని రేపుతోంది.