Begin typing your search above and press return to search.
వేగంగా తగ్గిపోతున్న జపాన్ జనాభా!
By: Tupaki Desk | 3 Jun 2022 11:30 PM GMTజపాన్ జనాభా వేగం తగ్గిపోతోంది. ప్రపంచంలోనే వృద్ధులు ఎక్కువగా ఉన్న దేశం జపానే కావడం గమనార్హం. ఆ దేశంలో ఏటా వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా.. జననాల రేటు మాత్రం అంతకంతకూ పడిపోతోంది. జపాన్ ప్రభుత్వం దీన్ని సరిదిద్దడానికి చర్యలు చేపడుతున్నా ఫలితం ఉండటం లేదు. ప్రస్తుతం జపాన్‌లో జననాల రేటు అమాంతం పడిపోయింది.2021లో 8,11,604 మంది మాత్రమే జన్మించారని ఆ దేశ జనాభా గణాంకాలు తెలుపుతున్నాయి. 1899తో పోలిస్తే ఇదే అతి తక్కువ కావడం గమనార్హం.
మరోవైపు పెళ్లి చేసుకునేవారి సంఖ్య కూడా తగ్గిపోయిందని తెలుస్తోంది. 2021లో 5,01,116 మంది మాత్రమే వివాహం చేసుకున్నారు. వృద్ధుల జనాభా పెరిగిపోతుండటం.. వారి వల్ల దేశ ఆర్థికాభివృద్ధికి ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో జపాన్ తలపట్టుకుంటోంది. గతేడాది అక్టోబర్‌లో జపాన్ జనాభా 125 మిలియన్లు కాగా, ఈ ఏడాది వీరిలో 6 లక్షల మంది తగ్గిపోయారు. దీంతో వరుసగా 11వ సారి దేశ జనాభా తగ్గిపోయింది. ఈ మేరకు జపాన్ అంతర్గత వ్యవహారాలు, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ తాజాగా వివరాలను వెల్లడించింది.
జపాన్‌లో 15 నుంచి 64 సంవత్సరాల మధ్య ఉన్నవారు గతంతో పోలిస్తే 5 లక్షలు తగ్గి దేశ జనాభాలో 59.4 శాతంగా ఉన్నారు. 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వృద్ధులు రికార్డు స్థాయిలో 28.9 శాతానికి చేరుకున్నారు. 14 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు కేవలం 11.8 శాతం మంది ఉన్నారు. ఇక కఠినమైన సరిహద్దు ఆంక్షల కారణంగా జపాన్‌లో నివసిస్తున్న విదేశీ పౌరుల సంఖ్య కూడా బాగా తగ్గింది. దీంతో ఓవైపు వృద్ధుల జనాభా పెరిగిపోయి.. మరోవైపు జననాలు లేక.. విదేశీ యువత కూడా దేశంలో లేక జ పాన్ చుక్కలు చూస్తోంది. సంపాదించేవారి శాతం ఆ దేశంలో గణనీయంగా పడిపోయింది.
జ పాన్ రాజధాని టోక్యోలో 26 ఏళ్ల తర్వాత జనాభా తగ్గిపోయింది. వాస్తవానికి టోక్యో ప్రపంచంలోని పెద్ద నగరాల్లో ఒకటి. జనాభా పరంగానూ, విస్తీర్ణంపరంగానూ టోక్యో ప్రపంచంలోనే పెద్ద నగరాల్లో ఒకటిగా నిలుస్తోంది. జపాన్‌లో జననాల రేటు పడిపోతుంటే మరోవైపు మరణాల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జనాభా పెరుగుదలపై కోవిడ్ కూడా దారుణంగా దెబ్బకొట్టింది.
జనాభా పెంచడానికి జపాన్ పలు పథకాలను కూడా ప్రవేశపెట్టింది. పెళ్లి చేసుకునే జంటలకు నగదును గిఫ్టుగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు జపాన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటన కూడా విడుదల చేసింది. కొత్తగా పెళ్లి చేసుకునే జంటలకు 6 లక్షల యెన్‌లు (భారత కరెన్సీలో రూ.4 లక్షలకుపైగా) నగదు ఇస్తామని ప్రకటించింది. ఈ పథకానికి యువత ఆకర్షితులై పెళ్లి చేసుకుంటే జనాభా పెరుగుతుందని జపాన్ విశ్వసిస్తోంది.