Begin typing your search above and press return to search.

ఉత్తర కొరియా’ ‘‘కొరివి’’కి జపాన్ వార్నింగ్

By:  Tupaki Desk   |   3 Feb 2016 11:00 PM IST
ఉత్తర కొరియా’ ‘‘కొరివి’’కి జపాన్ వార్నింగ్
X
ఒక నియంత ఇప్పుడు తూర్పు ఆసియా దేశాల్ని వణికిస్తున్నాడు. కఠిన నిర్ణయాలు.. శాంతికి చెక్ చెబుతూ మొండిగా వెళుతున్న వైనం ఇప్పుడు ఆందోళనకు గరి చేస్తుంది. అతగాడికి ముకుతాడు వేసేందుకు జపాన్ సిద్ధం కావటంతో ఏ నిమిషాన ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయం పలు దేశాల్ని వెంటాడుతోంది. ఈ మధ్యనే హైడ్రోజన్ బాంబును తయారు చేసిన ఉత్తరకొరియా ఇప్పుడు మరో క్షిపణి ప్రయోగానికి సిద్ధమవుతోంది. సమస్యల్లా సదరు ప్రయోగాన్ని జపాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

అయినప్పటికీ ఉత్తరకొరియా లెక్క చేయకుండా తాను చేయాలనుకున్న పనిని పూర్తి చేసే పనిలో భాగంగా సదరు క్షిపణి కౌంట్ డౌన్ షురూ చేయటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. శాటిలైట్ పేరిట తయారు చేసిన ఈ క్షిపణి అణ్వాయుధాల్ని మోసుకెళ్లటమే కాదు.. 3400 కిలోమీటర్ల లక్ష్యాన్ని సైతం చేధించగల సత్తా దీని సొంతం. దీంతో.. ఉత్తరకొరియా పొరుగున ఉన్న జపాన్ ఈ ప్రయోగాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ప్రయోగంలో భాగంగా తమ దేశ సరిహద్దుల్లోకి కానీ వస్తే.. శాటిలైట్ ను పేల్చేస్తామని.. తునాతునకలు చేస్తామని జపాన్ వార్నింగ్ ఇవ్వటమే కాదు.. ఈ ప్రయోగం మీద సీరియస్ గా ఉంది. ఫిబ్రవరి 8న ప్రయోగించాలని భావిస్తున్న ఈ ప్రయోగం రెండు దేశాల మధ్యనే కాదు.. తూర్పు దేశాల శాంతికి భంగం వాటిల్లే ప్రమాదం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దేశ గగనతలంలోకి కానీ శాటిలైట్ క్షిపణి కానీ వస్తే వెంటనే పేల్చేయాలంటూ జపాన్ రక్షణ మంత్రి జనరల్ నకతాని సైన్యానికి ఆదేశాలు జారీ చేయటంతో ఈ వ్యవహరం మరింద ముదిరింది. ఇప్పుడేం జరుగుతుందన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.​