Begin typing your search above and press return to search.

నిద్రపోతూనే హాజరుగా ఉండటం వారి స్పెషాలిటీ!

By:  Tupaki Desk   |   3 Jan 2017 5:38 AM GMT
నిద్రపోతూనే హాజరుగా ఉండటం వారి స్పెషాలిటీ!
X
నిద్రపోతూ హాజరుగా ఉండటం కూడా ఒక టాలెంటేనా... అవును కచ్చితంగా అది ఒక ఆర్ట్ అంటున్నారు జపనీయులు. పైగా దానికి "ఇనెమురి" అని నామకరణం కూడా చేసుకున్నారు. బస్సుల్లోనూ ట్రైన్స్ లోనూ ప్రయాణిస్తూ నిద్రపోవడం, లిఫ్ట్ లో బాగా పైకి వెళ్తూ కునుకుతీయడం, రైలు కోసం ఎదురుచూస్తూ కూడా రెప్పవాల్చడం... ఇలా చిన్న చిన్న సమయాల్లోనే కునుకు తీస్తుంటారు జపనీయులు. పనిరాక్షసులని పేరున్న జపాన్ వాళ్లు ఈ విషయంలో పనికోసం నిద్రను త్యాగం చేస్తుంటారట. వారి దృష్టిలో రాత్రవగానే మంచం పైకి చేరడం, ఉదయాన్నే లేవడం అనే ప్రక్రియను వాళ్లు నిద్రగా భావించరట.

మన దగ్గర కూడా చాలామంది క్లాసులో పాఠం వింటూ, మీటింగులో భాగస్వామి అవుతూ కూడా కునుకు తీస్తుంటారు. వాళ్లను ఇక్కడ రకరకాలుగా తిడుతుంటారు. కానీ... జపాన్ లో ఇలా ఇనెమురి చేసేవాళ్లను చూసినవారంతా.. "పాపం, రాత్రంతా బాగా పనిచేసివుంటాడు" అని భావించి గౌరవిస్తుంటారట. యుద్ధం తర్వాత, ఎక్కువ పని చేయడం గొప్ప గుణం అనే భావనలోంచి ఈ ఇనెమురి వచ్చిందని భావించిన జపనీయులు, ఇలా కునుకు తీసేవారిని గౌరవిస్తుంటారట. ఈ విషయంలో సరిగ్గా నిద్రపోవాలంటే ఏకాంతంగా ఉండాలని చాలామంది భావిస్తుంటారు కానీ.. జపాన్ లో భూకంపం, సునామీ లాంటివి వచ్చినప్పుడు కూడా ఇలా బహిరంగంగా నిద్రపోగలగడమే వారిని ఉపశమించేలా చేయగలిగిందట!

ఇక ఈ జపాన్ కునుకు "ఇనెమురి" మీద అధ్యయనం చేసిన డాక్టర్ బ్రిగిట్ స్టెగార్ ఈ విషయంపై మరింత క్లారిటీ ఇస్తున్నారు. ఇనెమురి అనేది అంతా అనుకునే నిద్రకాదని, అలా అని మద్యాహ్నం ఒక ముద్ద తిని తీసే కునుకూ కాదని, ఇది కేవలం జపాన్ కు మాత్రమే ప్రత్యేకమైన నిద్రా విధానం అని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/